Site icon HashtagU Telugu

GT vs SRH Thriller: హై స్కోరింగ్ థ్రిల్లర్ లో గుజరాత్ గెలుపు

Rajasthan Royals vs Gujarat Titans

Gujarat Titans Imresizer

ఇది కదా టీ ట్వంటీ మజా అంటే…ఇది కదా పరుగుల వర్షం అంటే…ఇది కదా బ్యాట్ కు , బంతికి మధ్య అసలు సిసలు పోటీ…చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన సన్ రైజర్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. సన్ రైజర్స్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ అయిదు వికేట్లతో చెలరేగిన హైదరాబాద్ కు ఓటమి తప్పలేదు.

మొదట బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ భారీ స్కోరు చేసింది. అభిషేక్ శర్మ 42బంతుల్లో 6ఫోర్లు 3సిక్సర్లతో 65, మార్క్రామ్ 40 బంతుల్లో 2ఫోర్లు , 3సిక్సర్లతో 56 రన్స్ తో చెలరేగగా… చివర్లో శశాంక్ సింగ్ కేవలం 6బంతుల్లో 1ఫోర్, 3సిక్సర్లతో 25 పరుగులు చేశాడు. దీంతో సన్ రైజర్స్ 20 ఓవర్లకు 6వికెట్లు కోల్పోయి 195పరుగులు చేసింది. చివరి ఓవర్ మూడు బంతులకు సన్ రైజర్స్ కొత్త బ్యాటర్ శశాంక్ సింగ్ మూడు హ్యాట్రిక్ సిక్సులు బాదడం ఈ మ్యాచ్‌కే హైలెట్ అని చెప్పొచ్చు.గుజరాత్‌ బౌలర్లలో షమీ 3, జోసఫ్‌, యశ్‌ దయాల్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్‌కు సాహా అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. ఈ వెటరన్‌ వికెట్‌కీపర్‌ ధాటిగా ఆడుతూ సన్‌రైజర్స్‌ బౌలర్లను ఆటాడుకున్నాడు. ఈ క్రమంలో సాహా 28 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అయితే ఉమ్రాన్ మాలిక్ ఎంట్రీతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఈ యువ పేసర్‌ నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడ్డాడు. వరుస ఓవర్లలో సాహా , హార్దిక్ పాండ్య , గిల్, మిల్లర్ లను ఔట్ చేశాడు. దీంతో మ్యాచ్ హైదరాబాద్ వైపు తిరిగింది. అయితే రాహుల్ తేవటియా , రషీద్ ఖాన్ సంచలన పార్టనర్ షిప్ తో మళ్ళీ గుజరాత్ రేసులోకి వచ్చింది. రషీద్‌ ఖాన్‌ 11 బంతుల్లో 4 సిక్సర్లతో 31 నాటౌట్‌, తెవాతియా 21 బంతుల్లో 4 ఫోర్లు , 2 సిక్సర్లతో 40 నాటౌట్.. చెలరేగడంతో గుజరాత్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గుజరాత్‌ గెలుపుకు ఆఖరి ఓవర్‌లో 22 పరుగులు కావల్సిన తరుణంలో రషీద్‌ ఖాన్‌ ఏకంగా నాలుగు సిక్సర్లు బాది జట్టును గెలిపించాడు. దీంతో సన్‌రైజర్స్‌ యువ పేస్‌ గన్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ (5/25) సంచలన బౌలింగ్‌ ప్రదర్శన వృధా అయ్యింది. తాజా విజయంతో పాయింట్ల పట్టికలో గుజరాత్ మళ్లీ టాప్ ప్లేస్ కు దూసుకెళ్లింది.