RCB Vs RR: టెర్రరిస్టుల నుంచి విరాట్ కోహ్లీకి ప్రాణహాని

రాజస్థాన్ రాయల్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య అహ్మదాబాద్‌లో ఎలిమినేటర్2 జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ ప్రాక్టీస్‌ను రద్దు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఓ నివేదిక ప్రకారం విరాట్ కోహ్లీకి హత్య బెదిరింపులు వచ్చాయి. ఈ కారణంగా కోహ్లీ భద్రతను దృష్టిలో ఉంచుకుని

RCB Vs RR: ఐపీఎల్ తొలి ఎలిమినేటర్ మ్యాచ్ లో ఎస్ఆర్ఎచ్ పై కోల్కతా విజయం సాధించి ఫైనల్ కు చేరింది. ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య అహ్మదాబాద్‌లో ఎలిమినేటర్2 జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ ప్రాక్టీస్‌ను రద్దు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఓ నివేదిక ప్రకారం విరాట్ కోహ్లీకి హత్య బెదిరింపులు వచ్చాయి. ఈ కారణంగా కోహ్లీ భద్రతను దృష్టిలో ఉంచుకుని జట్టు ప్రాక్టీస్‌తో పాటు ఇరు జట్లు మీడియా సమావేశాన్ని కూడా రద్దు చేసుకున్నాయి.

కాగా రాజస్థాన్, బెంగళూరు జట్లుకు ఈ మ్యాచ్ డూ ఆర్ డై లాంటిదే. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు రెండో క్వాలిఫయర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడుతుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. రెండో క్వాలిఫయర్ మే 24న జరగనుంది. ఆ తర్వాత ఫైనల్ మ్యాచ్ మే 26న చెన్నైలో జరగనుంది.సీజన్ ఆరంభంలో పేలవమైన ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో చిట్టచివరిన నిలిచిన ఆర్సీబీ ప్లేఆప్స్ కు అర్హత సాధించి టైటిల్ రేసులో నిలవడం అభినందనీయం. అసలు బెంగుళూరు జట్టు ఈ రేంజ్ లో పునరాగమనం చేస్తుందని ఎవరూ ఊహించలేదు. వరుసగా 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఆర్సీబీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి టాప్-4కి చేరింది. గత డూ ఆర్ డై మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను 27 పరుగుల తేడాతో ఓడించి ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది.

ఈ రోజు మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. ఈ సీజన్‌లో ఇద్దరూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. రజత్ పాటిదార్‌కు మూడో స్థానంలో అవకాశం లభించవచ్చు. కామెరాన్ గ్రీన్ నాలుగో స్థానంలో దిగవచ్చు. గ్లెన్ మాక్స్‌వెల్ ఐదో నంబర్‌లో ఆడే అవకాశం ఉంది. దినేష్ కార్తీక్ ఫినిషర్ పాత్ర పోషిస్తాడు. బౌలింగ్ దళాన్ని మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్, లాకీ ఫెర్గూసన్, కర్ణ్ శర్మలు నడిపిస్తారు. ఆర్ఆర్ విషయానికి వస్తే.. యశస్వి జైస్వాల్, టామ్ కాడ్మోర్ ఓపెనర్లుగా ఇన్నింగ్స్ ఆరంభింస్తారు. కెప్టెన్ సంజు సస్సామాన్ మూడో స్థానంలో ఆడటం ఖాయం. రియాన్ పరాగ్‌ నాలుగో స్థానంలో ఆడతాడు. ప్రస్తుత సీజన్‌లో పరాగ్ అద్భుతంగ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇక ధృవ్ జురెల్, రోవ్‌మన్ పావెల్ మిడిల్ ఆర్డర్‌ లో వస్తారు. రవిచంద్రన్‌ అశ్విన్‌, యుజువేంద్ర చాహల్‌లు స్పిన్‌ విభాగం బాధ్యతలు తీసుకోనుండగా ట్రెంట్ బౌల్ట్, అవేశ్ ఖాన్, సందీప్ శర్మలు పేస్ దళంతో ఎటాక్ చేయనున్నారు.

Also Read: MS Dhoni: ఐపీఎల్ 2025పై ధోనీ ఫ్యాన్స్ ఆశలు.. అందుకే లండన్ టూర్