Sania Mirza : టెన్నిస్ స్టార్ సానియా నికర ఆస్తులు దాదాపు రూ. 200 కోట్లు!!

టెన్నిస్ (Tennis) స్టార్ సానియా మీర్జా తన కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. గాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (Sania Mirza) తన కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. గాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ సానియా కెరీర్‌లో చివరి టోర్నమెంట్. 36 ఏళ్ల సానియా..రెండు దశాబ్దాల టెన్నిస్ కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను సాధించారు. ఎన్నో అవార్డులు, ట్రోఫీలు అందుకున్నారు. ఆమె ఆస్తుల విలువకు సంబంధించిన ఆసక్తికరమైన సమాచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం..

అవన్నీ కలిపి

2022 నాటికి సానియా మీర్జా (Sania Mirza) నికర ఆస్తుల విలువ 25 మిలియన్ డాలర్లు. అంటే దాదాపు రూ. 200 కోట్లు. ఇందులో ప్రైజ్ మనీ ద్వారా వచ్చే ఆదాయాలు, ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాలు కూడా కలిసి ఉన్నాయి. WTA టూర్ ద్వారా సానియా మీర్జా $6,963,060 ప్రైజ్ మనీ సంపాదించింది. ఆమె ప్రస్తుతం  తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఉన్నారు. సానియా అడిడాస్, స్ప్రైట్ వంటి అనేక బ్రాండ్‌లకు అంబాసిడర్ గా కూడా ఉన్నారు.

గౌరవాలు మరియు బిరుదులు

🎾 సానియా మీర్జా అర్జున అవార్డు (2004), పద్మశ్రీ అవార్డు (2006), రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు (2015) , పద్మ భూషణ్ అవార్డు (2016)లను అందుకున్నారు.

🎾 సానియా ఇప్పటివరకు 6 మేజర్ ఛాంపియన్‌షిప్‌లలో పతకాలు సాధించింది. ఆమె డబుల్స్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్ (2016), వింబుల్డన్ (2015), యుఎస్ ఓపెన్ (2015) టైటిళ్లను గెలుచుకుంది.

🎾 సానియా మిక్స్‌డ్ డబుల్స్‌లో మూడు గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ (2009), ఫ్రెంచ్ ఓపెన్ (2012), యుఎస్ ఓపెన్ (2014) టైటిళ్లను కూడా గెలుచుకున్నారు.

కార్ల కలెక్షన్స్

సానియా మీర్జా హైదరాబాద్‌లోని ఒక భవనంలో నివసిస్తోంది. దుబాయ్‌లో ఇల్లు కూడా ఉంది. ఆమె వద్ద కార్ల గొప్ప కలెక్షన్లు కూడా ఉన్నాయి.  సానియాకు బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 , పోర్షే కరెరా జిటి , మెర్సిడెస్-బెంజ్, ఆడి, రేంజర్ రోవర్ కార్లు కూడా ఉన్నాయి.

సానియా, షోయబ్‌ల అనుబంధం

సానియా మీర్జా, షోయబ్ మాలిక్‌ 2010లో పెళ్లి చేసుకున్నారు.  వీరికి 30 అక్టోబర్ 2018న కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్‌ జన్మించారు.
ఇప్పుడు పాక్ మీడియాలో సానియా, షోయబ్ విడాకులు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ అధికారికంగా విడాకులు తీసుకున్నారని కూడా అంటున్నారు. ‘నేను నా స్వంత కాళ్ళపై జీవించే వ్యక్తిని’ అని సానియా wtatennis.comకు చెప్పారు. ‘గత సంవత్సరం WTA ఫైనల్స్ తర్వాత మాత్రమే నేను రిటైర్ కావాలని అనుకున్నాను.  కానీ కుడి మోచేయి గాయం కారణంగా, US ఓపెన్ మరియు మిగిలిన టోర్నమెంట్స్ నుంచి పేరును ఉపసంహరించుకోవాల్సి వచ్చింది” అని సానియా వివరించారు.

Also Read:  Jallikattu : జల్లికట్టు సీజన్ మొదలైంది. పుదుక్కోట్టైలో 70 మందికి గాయాలు!!