Site icon HashtagU Telugu

Maria Sharapova: తల్లయిన టెన్నిస్‌ బ్యూటీ

Maria

Maria

రష్యన్ టెన్నిస్ బ్యూటీ , మాజీ వరల్డ్ నెంబర్ వన్ మరియా షరపోవా తల్లయింది. పండంటి బాబుకు జన్మనిచ్చిన విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా ఆమె అభిమానులతో పంచుకుంది. తమ కుమారుడి పేరు థియోడర్‌ అని షరపోవా వెల్లడించింది. 35 ఏళ్ల ఈ రష్యన్‌ బ్యూటీ బ్రిటన్‌కు చెందిన 42 ఏళ్ల వ్యాపారవేత్త అలెగ్జాండర్‌ గిల్కెస్‌తో డేటింగ్ లో ఉంది.తర్వాత వీరిద్దరు 2020లో తమకు నిశ్చితార్థం జరిగినట్లు ప్రకటించారు. తాజాగా. తమకు కుమారుడు జన్మించిన విషయాన్ని షరపోవా వెల్లడిస్తూ. ఇన్‌స్టాలో తమ చిన్నారితో ఉన్న ఫొటోను షేర్‌ చేశారు.

టెన్నిస్ ప్రపంచంలో ఆటతో పాటు అందంతోనూ బాగా పాపులర్ అయిన షరపోవా 2004లో 17 ఏళ్ల వయసులో వింబుల్డన్‌లో తన తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలుచుకుంది. 2012లో ఫ్రెంచ్ ఓపెన్‌తో కెరీర్ స్లామ్ విజయాన్ని కూడా పూర్తి చేసింది. అయితే 2016లో డోపింగ్‌ కారణంగా షరపోవాపై 15 నెలల నిషేధం విధించారు. నిషేధం పూర్తయిన తర్వాత ఏప్రిల్ 2017లో తిరిగి వచ్చిన షరపోవా 2020 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా ఓపెన్ తో టెన్సిస్ ప్రపంచానికి వీడ్కోలు పలికింది. ఆమె రిటైర్మెంట్ పట్ల అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.
ప్రస్తుతం వ్యక్తిగత జీవితంలో భాగంగా మాతృత్వ మధురిమలను ఆస్వాదిస్తోంది.