Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

దక్షిణాఫ్రికా 2018లో జోహన్నెస్‌బర్గ్‌లో ఆస్ట్రేలియాపై 492 పరుగుల తేడాతో గెలిచి ఐదవ స్థానంలో నిలిచింది. శ్రీలంక 2009లో బంగ్లాదేశ్‌పై చట్టోగ్రామ్‌లో 465 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Published By: HashtagU Telugu Desk
Biggest Wins In Test Cricket

Biggest Wins In Test Cricket

Biggest Wins In Test Cricket: భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో సౌత్ ఆఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా భారత్‌ను 408 పరుగుల తేడాతో ఓడించింది. ఇది టెస్ట్ క్రికెట్‌లో పరుగుల పరంగా ఏ జట్టుకైనా టీమిండియాపై నమోదైన అతిపెద్ద విజయం. టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా టాప్ 10 అతి పెద్ద విజయాలు (Biggest Wins In Test Cricket) సాధించిన జట్లు ఏవో ఇక్కడ తెలుసుకుందాం!

ఇంగ్లాండ్‌కు అగ్రస్థానం, భారత్‌కు కూడా స్థానం

చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజయం సాధించిన జట్టుగా ఇంగ్లాండ్ నిలిచింది. 1928లో బ్రిస్బేన్ మైదానంలో ఆస్ట్రేలియాను ఏకంగా 675 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్ ఓడించింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మూడు స్థానాలను దక్కించుకుంది. 1934లో ది ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్‌పై 562 పరుగుల తేడాతో రెండో స్థానంలో నిలిచింది. అలాగే 1911లో మెల్‌బోర్న్‌లో దక్షిణాఫ్రికాను 530 పరుగుల తేడాతో, 2004లో పాకిస్తాన్‌ను వాకాలో 491 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఓడించింది. ఆధునిక క్రికెట్‌లో సంచలనం సృష్టిస్తూ బంగ్లాదేశ్ 2023లో మీర్‌పూర్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను 546 పరుగుల తేడాతో ఓడించి మూడో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది.

Also Read: Tongue Cancer: ఏ వ్యక్తులకు టంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది? ల‌క్ష‌ణాలివే?!

దక్షిణాఫ్రికా, భారత్ సహా ఇతర జట్ల విజయాలు

దక్షిణాఫ్రికా 2018లో జోహన్నెస్‌బర్గ్‌లో ఆస్ట్రేలియాపై 492 పరుగుల తేడాతో గెలిచి ఐదవ స్థానంలో నిలిచింది. శ్రీలంక 2009లో బంగ్లాదేశ్‌పై చట్టోగ్రామ్‌లో 465 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత జట్టు కూడా ఈ జాబితాలో ఉంది. 2024లో రాజ్‌కోట్‌లో ఇంగ్లాండ్‌ను 434 పరుగుల తేడాతో ఓడించి ఎనిమిదో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. వెస్టిండీస్ 1976లో మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్‌ను 425 పరుగుల తేడాతో ఓడించింది. ఈ టాప్ 10 జాబితాలో చివరగా న్యూజిలాండ్ 2004లో క్రైస్ట్‌చర్చ్‌లో శ్రీలంకపై 423 పరుగుల తేడాతో విజయం సాధించింది.

 

  Last Updated: 27 Nov 2025, 05:30 PM IST