Mohammed Siraj: టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టు సభ్యుడు, పేసర్ మహ్మద్ సిరాజ్‌కు జూబ్లీహిల్స్(Jubilee Hills)లో 600చదరపు గజాల ఇంటి స్థలం(Home space) కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్కు చెందిన స్టార్ బౌలర్ సిరాజ్ కూడా ప్రపంచకప్లో టీమిండియా సభ్యుడిగా ఉన్నారు. ఈ సందర్భంగా.. టైటిల్ గెలుకుని స్వదేశానికి వచ్చిన సిరాజ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశాడు. ఆయనకు టీమిండియా జెర్సీని కూడా బహుకరించాడు. అంతర్జాతీయ క్రికెట్లో భారత దేశానికి, మన తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు, గౌరవాన్ని తెచ్చిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ క్రమంలో.. మహ్మద్ సిరాజ్కు ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు.. సిరాజ్ కు ఇంటి స్థలం కేటాయించింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయిస్తూ జీవో జారీ చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
టీమిండియాలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఆడుతున్న ఏకైక ఆటగాడు మహ్మద్ సిరాజ్..ప్రపంచకప్‌లో సిరాజ్ గ్రూప్ స్టేజ్ వరకు మాత్రమే తుది జట్టులో కొనసాగాడు. విండీస్ పిచెస్ స్పిన్‌కు అనుకూలంగా ఉండడంతో మనోడికి చోటు దక్కలేదు. దాయాది పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించడంలో సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు రెండు సార్లు వరల్ట్ బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచిన తెలంగాణకు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్‌కు కూడా సీరాజ్‌తో పాటు ప్రభుత్వం ఉద్యోగం..నగదు ప్రోత్సాహకం ఇచ్చేందుకు ఇది వరకు జరిగిన మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.