Telangana Government announces Rs.1 crore cash, group 2 job, land for young athlete Deepthi Jeevanji : దీప్తి జీవాంజి (Deepthi Jeevanji) కి తెలంగాణ సర్కార్ (Telangana Govt) వరాల జల్లు కురిపించింది. పారా ఒలింపిక్స్(Paralympics )లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన మహిళల 400 మీటర్ల T20లో ఫైనల్‌లో 55.82 సెకన్లలో లక్ష్యాన్ని ఛేదించి మూడో స్థానంలో నిలిచి ప్రపంచ రికార్డుతో కాంస్య పతకాన్ని (Bronze Medal) సాధించింది తెలంగాణ బిడ్డ దీప్తి. పట్టుదల ముందు మానసిక వైకల్యం ఏమాత్రం పనిచేయదని దీప్తి నిరూపించింది. దేశ ప్రధాని మోడీ , రాష్ట్రపతి , పలువురు కేంద్ర మంత్రులు , పలువురు ముఖ్యమంత్రులు , రాజకీయ నేతలు , సినీ , బిజినెస్ రంగం వారు ఇలా ప్రతి ఒక్కరు దీప్తిని కొనియాడుతూ..ప్రశంసలు కురిపిస్తున్నారు.
తాజాగా తెలంగాణ సర్కార్..దీప్తికి గ్రూప్-2 ఉద్యోగం (Group-2 Job), రూ.కోటి నగదు బహుమతి (1 Crore Cash Prize), వరంగల్‌లో 500 గజాల స్థలం (500 square yards for her house) తో పాటు దీప్తి కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేష్‌కు రూ.10 లక్షల నగదు పురస్కారాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా దీప్తిని సీఎం రేవంత్ సన్మానించారు. అలాగే పారా గేమ్స్ క్రీడాకారులకు శిక్షణ, ప్రోత్సహకాలు ఇవ్వాలని సూచించారు. దీప్తి జీవంజితో పాటు ఆమె కోచ్ రమేష్ బాబుకు నగదు పురస్కారం ప్రకటించడంపై తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ కె.శివసేన రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పారా అథ్లెట్ దీప్తి జీవంజి తెలంగాణ యువతకు, క్రీడాకారులకు ఆదర్శమని.. రేవంత్ ప్రభుత్వం ఆమెను గౌరవించడం భవిష్యత్తు క్రీడాకారులకు స్పూర్తిగా నిలుస్తుందని శివసేనారెడ్డి అన్నారు.
వరంగల్ జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి..చిన్నప్పటి నుంచి అథ్లెటిక్స్ విజయం సాధించాలనే పట్టుదలతో ఉండేది. పుట్టినప్పటి నుంచి మేధస్సు బలహీనంగా ఉండడంతో గ్రామస్తులు, బంధువులు హేళన చేయడం , అవమానించడం ఇలా ఎన్నో చేసేవారు కానీ వారి హేళనలు ఏమాత్రం పట్టించుకోకుండా… కష్టాలను అధిగమించి అంతర్జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేసింది. దీప్తి విజయాన్ని హర్షిస్తూ ఆమె స్వగ్రామంలో గ్రామస్థులు, పాఠశాల నిర్వాహకులు, విద్యార్థులు, స్నేహితులు , జిల్లా వాసులు ఇలా అంత సంబరాలు చేసుకుంటున్నారు. ఒకప్పుడు హేళన చేసిన వారే ఇప్పుడు శభాష్..మా ఉరికి .. మా జిల్లాకు పేరు తెచ్చిందని కొనియాడుతున్నారు.
Read Also : Israel Vs Gaza : ఇజ్రాయెల్ దాడులు.. 48 గంటల్లో 61 మంది గాజా పౌరులు మృతి