Site icon HashtagU Telugu

CWG High Jump: హై జంప్ లో తేజశ్విన్ శంకర్ కు కాంస్యం

Tejasavin Imresizer

Tejasavin Imresizer

బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ లో భారత్ పతకాల వేట మొదలు పెట్టింది. తేజశ్విన్ శంకర్ భారత కు మొదటి ట్రాక్ అండ్ ఫీల్డ్ పతకాన్ని అందించాడు. పురుషుల హైజంప్‌లో కాంస్యం సాధించి కొత్త రికార్డు సృష్టించాడు.

నాలుగేళ్ళలో తొలిసారిగా పోటీపడుతున్న తేజశ్విన్ 2.22 మీటర్ల జంప్ చేసి మెడల్ గెలిచాడు. తేజస్విన్ 2.10 మీటర్ల హర్డిల్‌ను సులభంగా క్లియర్ చేయడంతో ప్రారంభించాడు. అయితే మరో నలుగురు అథ్లెట్లు 2.15 మీటర్ల మార్కును దాటగలిగారు. ఆ తర్వాత భారత ఆటగాడు తన మొదటి ప్రయత్నంలోనే 2.15 మీటర్ల హర్డిల్‌పై గ్లైడింగ్ చేశాడు.

ఆ త‌ర్వాత‌ 2.15 మీటర్ల నుంచి తేజస్విన్ మరింత మెరుగ్గా 2.19 మీటర్లకు చేరుకుంది. మధ్యలో రెండు ప్రయత్నాలు విఫలమైనా… మరో అథ్లెట్ డొనాల్డ్ థామస్ తన చివరి ప్రయత్నంలో 2.25 స్కోరును క్లియర్ చేయలేకపోవడంతో, తేజశ్విన్ కు కాంస్యం ఖాయమైంది. తేజస్విన్ కాంస్యం సాధించడంతో భారత్ పతకాల సంఖ్య 18కి చేరింది. ఇందులో ఐదు గోల్డ్ మెడల్స్, ఆరు సిల్వర్, ఏడు బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. కాగా ఈ కామన్ వెల్త్ గేమ్స్ లో ట్రాక్ అండ్ ఫీల్డ్ కు సంబంధించి తొలి మెడల్ గెలిచిన అథ్లెట్ తేజస్విన్ శంకర్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధాని మోదీ శంకర్ ను అభినందిస్తూ ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. తేజస్విన్ శంకర్ చరిత్ర సృష్టించాడనీ, భవిషత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.

Exit mobile version