Site icon HashtagU Telugu

Teamindia Tour Of England: భారత్- ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ విడుద‌ల చేసిన బీసీసీఐ.. టీమిండియాకు ప‌రీక్షే..!

Teamindia Tour Of England

Teamindia Tour Of England

Teamindia Tour Of England: ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) 2025లో వేసవి సీజన్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. మరోవైపు భారత జట్టు ఇంగ్లండ్‌ పర్యటన (Teamindia Tour Of England) తేదీలను కూడా వెల్లడించింది. వచ్చే ఏడాది జూన్ 20 నుంచి ఆగస్టు 4 వరకు భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. దీంతో పాటు భారత మహిళల జట్టు కూడా ఇదే సమయంలో ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. మహిళల జట్ల మధ్య 3 టీ20, 3 వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి.

లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండో మ్యాచ్ బర్మింగ్‌హామ్‌లో.. మూడో మ్యాచ్ లార్డ్స్‌లో జరగనుంది. నాలుగు, ఐదవ టెస్ట్ మ్యాచ్‌లు వరుసగా మాంచెస్టర్, లండన్ (ది ఓవల్ స్టేడియం)లో జరుగుతాయి. ఇది కాకుండా 2026 సంవత్సరంలో మొదటిసారిగా లార్డ్స్ మైదానంలో మహిళల జట్ల టెస్ట్ మ్యాచ్ ఆడుతుందని, ఇందులో భారత్- ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయని ECB ప్రకటించింది.

Also Read: Bad Habits : ఇంట్లో మహిళలు అనుసరించే ఈ 6 అలవాట్లు సమస్యలను పెంచుతాయి..!

ఇదే సమయంలో WTC ఫైనల్ జరగనుంది

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ తేదీని ఇంకా వెల్లడించలేదు. అయితే ఫైనల్ మ్యాచ్ వచ్చే ఏడాది జూన్‌లో జరుగుతుందని స‌మాచారం. ప్రస్తుతం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పట్టికలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. ఫైనల్స్‌కు వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ టీమ్ ఇండియా ఫైనల్ కు చేరితే.. ఇంగ్లండ్ తో సిరీస్ కు కాస్త ముందు ఇంగ్లండ్ లోని లార్డ్స్ వేదికగా జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్ సవాల్ ను అధిగమించాల్సి ఉంటుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈసీబీ సీఈవో రిచర్డ్ గౌల్డ్ మాట్లాడుతూ.. భారత్‌తో జరిగే సిరీస్‌ తమకు ఎప్పుడూ లాభదాయకమేనని అన్నారు. గతంలో ఇరు జట్ల టెస్టు సిరీస్‌ కూడా ముళ్లకంచెతో కూడుకున్నదని, వచ్చే ఏడాది కూడా ఇరు జట్ల మధ్య గట్టి పోటీ ఉంటుందని గౌల్డ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. భారత్ చివరిసారిగా 2022లో టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్‌లో పర్యటించిందని.. ఆపై ఇరు జట్ల మధ్య జరిగిన 5 మ్యాచ్‌ల సిరీస్ 2-2తో డ్రాగా ముగిసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.

Exit mobile version