Site icon HashtagU Telugu

WTC Test Matches: డ‌బ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన జట్లు ఇవే!

WTC Test Matches

WTC Test Matches

WTC Test Matches: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC Test Matches) రావ‌డంతో టెస్ట్ క్రికెట్‌కు కొత్త గుర్తింపును ఇచ్చింది. ఇప్పుడు ప్రతి టెస్ట్ మ్యాచ్ కేవలం చరిత్ర సృష్టించడానికి మాత్రమే కాదు, ఛాంపియన్ అవ్వడానికి జరిగే పోటీలో కూడా కీలకమైనదిగా మారింది. ప్రతి జట్టు ప్రతి మ్యాచ్‌లో పాయింట్లను సేకరిస్తుంది. లక్ష్యం WTC ఫైనల్‌ను గెలవడం.

WTC 2019లో ప్రారంభమైంది. ఇప్పటివరకు ఈ ఛాంపియన్‌షిప్‌లో మూడు ఫైనల్స్ జ‌రిగాయి. మొదటి టైటిల్‌ను న్యూజిలాండ్ సొంతం చేసుకుంది. రెండవ టైటిల్‌ను ఆస్ట్రేలియా తన పేరిట చేసుకుంది. మూడో ఫైన‌ల్‌లో సౌతాఫ్రికా ఛాంపియ‌న్‌గా అవ‌త‌రించింది. కానీ WTC చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన జట్ల గురించి మాట్లాడితే ఈ జాబితాలో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు? అనేది చూద్దాం!

WTC చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన జట్లు

WTC చరిత్రలో ఆస్ట్రేలియా జ‌ట్టు 57 మ్యాచ్‌లు ఆడితే 35 విజ‌యాలు సాధించింది. ఇంగ్లాండ్ 69 మ్యాచ్‌లు ఆడితే 34 విజ‌యాలు త‌మ ఖాతాలో వేసుకుంది. భార‌త్ 60 మ్యాచ్‌లు ఆడితే 32 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలుపొందింది. సౌతాఫ్రికా 41 మ్యాచ్‌లు ఆడ‌గా 22 మ్యాచ్‌ల్లో గెలుపొంద‌గా.. న్యూజిలాండ్ 39 మ్యాచ్‌ల్లో 19 విజ‌యాలు, శ్రీలంక 39 మ్యాచ్‌ల్లో 13, పాకిస్థాన్ 40 మ్యాచ్‌ల్లో 13, వెస్టిండీస 42 మ్యాచ్‌ల్లో 10, బంగ్లాదేశ్ 33 మ్యాచ్‌ల్లో 5 విజ‌యాలు మాత్రమే సాధించింది.

Also Read: Massive Accident : ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. లోయలో పడిన టాక్సీ, ఎనిమిది మంది మృతి

ఏ జ‌ట్టు నంబర్ 1?

ప్రస్తుతం WTC చరిత్రలో అత్యధిక విజయాలు ఆస్ట్రేలియా పేరిట ఉన్నాయి. వారు 57 మ్యాచ్‌లలో 35 మ్యాచ్‌లు గెలిచి ఈ జాబితాలో అగ్రస్థానాన్ని సాధించారు. ఆస్ట్రేలియా WTC ఫైనల్‌లో భారత్‌ను ఓడించి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టెస్ట్ కిరీటాన్ని సొంతం చేసుకుంది.

ఇంగ్లాండ్ 69 మ్యాచ్‌లలో 34 విజయాలతో రెండవ స్థానంలో ఉంది. అయితే టీమ్ ఇండియా 60 మ్యాచ్‌లలో 32 మ్యాచ్‌లు గెలిచి మూడవ స్థానంలో ఉంది. అయినప్పటికీ, భారత్ ఇప్పటివరకు రెండుసార్లు WTC ఫైనల్‌కు చేరుకుంది. కానీ రెండుసార్లూ ట్రోఫీని కోల్పోయింది. న్యూజిలాండ్, సౌతాఫ్రికా జ‌ట్లు కూడా బలంగా ఉన్నాయి.