Site icon HashtagU Telugu

IPL 2023 Auction: రేపే ఐపీఎల్‌ మినీ వేలం.. పూర్తి వివరాలివే..!

tata ipl 2022

tata ipl 2022

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ అధికారులు వేలాని (Auction)కి ముందు గురువారం కొచ్చి చేరుకోనున్నారు. అలాగే 10 జట్ల ఫ్రాంచైజీ మీట్, మాక్ వేలం గురువారం జరగనున్నాయి. డిసెంబర్ 23న (శుక్రవారం) ఐపీఎల్‌ మినీ వేలం కొచ్చిలో షెడ్యూల్ చేయబడింది. ఐపీఎల్ ఫ్రాంచైజీల అధికారులు కూడా తమ వేలం వ్యూహాన్ని పక్కాగా చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఫ్రాంచైజీలు ఇప్పటికే తమ జట్టులో ఉన్న 163 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి.

ఐపీఎల్ వేలం 2023 కోసం కొచ్చిలోని బోల్గట్టి ద్వీపంలో రెండు అంతస్తుల గ్రాండ్ హయత్‌ను బీసీసీఐ బుక్ చేసింది. మినీ-వేలం డిసెంబర్ 23 మధ్యలో ఒక గంట విరామంతో 7 గంటలు ఉంటుంది. వేలం రోజు కంటే ముందుగా డిసెంబర్ 21న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులతో ఫ్రాంచైజీలు సమావేశం కానున్నాయి. ఆటగాళ్ల లభ్యతపై ఫ్రాంచైజీలకు కొంత స్పష్టత వస్తుంది. మాక్ వేలం కోసం ప్రసారకర్తలతో డిసెంబరు 22న మరో సమావేశాలు జరగనున్నాయి.

IPL 2023 వేలం కోసం ఫ్రాంచైజీల పర్స్‌ వివరాలు

– ముంబై ఇండియన్స్: రూ. 20.55 కోట్లు
– చెన్నై సూపర్ కింగ్స్: రూ. 20.45 కోట్లు
– ఢిల్లీ క్యాపిటల్స్: రూ. 19.45 కోట్లు
– రాజస్థాన్ రాయల్స్: రూ. 13.2 కోట్లు
– లక్నో సూపర్ జెయింట్: రూ. 23.35 కోట్లు
– రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రూ. 8.75 కోట్లు
– గుజరాత్ టైటాన్స్: రూ. 19.25 కోట్లు
– కోల్‌కతా నైట్ రైడర్స్: రూ. 7.05 కోట్లు
– పంజాబ్ కింగ్స్: రూ. 32.2 కోట్లు
– సన్‌రైజర్స్ హైదరాబాద్: రూ. 42.25 కోట్లు

ముఖ్యమైన వివరాలు
– 10 జట్లు ఇప్పటికే 163 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయి.
– 87 స్లాట్‌లకు వేలం నిర్వహించనున్నారు.
– విదేశీ క్రికెటర్లకు 30 స్లాట్లు మిగిలి ఉన్నాయి.
– ఫ్రాంచైజీకి మిగిలి ఉన్న మొత్తం ప్లేయర్ పర్స్ – 206.5 కోట్లు.
– ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఇప్పటికే రూ.743.5 కోట్లు వెచ్చించాయి.
– మొత్తం ఐపీఎల్‌లో 991 మంది ఆటగాళ్లకు వేలం వేశారు.

Exit mobile version