Team India New Record: టీమిండియా న‌యా రికార్డు.. 21 టీ20 మ్యాచ్‌ల్లో 20 విజ‌యం!

టీ20 ఫార్మాట్‌లో ఈ సిరీస్‌తో సహా ఏడాది పొడవునా జట్టు ప్రదర్శన ప్రపంచంలోనే నంబర్ వన్ జట్టుగా ఎందుకు ఉందో నిరూపించింది. 21 మ్యాచ్‌ల్లో 20 మ్యాచ్‌లు గెల‌వ‌డంతో జట్టు గెలుపు శాతం 95.23%గా మారడం చరిత్రాత్మకం.

Published By: HashtagU Telugu Desk
India vs Bangladesh

India vs Bangladesh

Team India New Record: బుధవారం జరిగిన రెండో టీ20లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా (Team India New Record) 86 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. యువ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి, రింకూ సింగ్ లు జట్టు తరఫున ధీటుగా రాణించి అర్ధ సెంచరీలు చేశారు. ఈ విజయంతో టీమిండియా ఈ ఏడాది టీ-20 రికార్డు గతంలో కంటే మెరుగ్గా మారింది.

మొదట రోహిత్ శర్మ కెప్టెన్సీలో, ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో జట్టు గణాంకాలు చూస్తుంటే జట్టు ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 21 టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడి, అందులో 20 మ్యాచ్‌లు గెలిచి విజయం సాధించింది. ఈ సమయంలో టీమిండియా ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయింది. జింబాబ్వే లాంటి జట్టుపై భార‌త్ ఈ ఓమిని చవిచూడడం ఆశ్చర్యకరం. ఓవరాల్ గా సూర్యకుమార్ కెప్టెన్సీ రికార్డును పరిశీలిస్తే.. కెప్టెన్ గా 12 మ్యాచుల్లో 10 గెలిచి రెండింట్లో మాత్రమే ఓడిపోయాడు.

Also Read: Ratan Tata Quotes : రతన్ టాటా చెప్పిన టాప్-10 సూక్తులు ఇవే

టీమ్ ఇండియా విజయాల శాతం

టీ20 ఫార్మాట్‌లో ఈ సిరీస్‌తో సహా ఏడాది పొడవునా జట్టు ప్రదర్శన ప్రపంచంలోనే నంబర్ వన్ జట్టుగా ఎందుకు ఉందో నిరూపించింది. 21 మ్యాచ్‌ల్లో 20 మ్యాచ్‌లు గెల‌వ‌డంతో జట్టు గెలుపు శాతం 95.23%గా మారడం చరిత్రాత్మకం. దీంతో టీ20 క్రికెట్‌లో ఆ జట్టు సరికొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పింది.

నితీష్ రెడ్డి రాణించాడు

ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో యువకుడు నితీశ్ బంగ్లాదేశ్ బౌల‌ర్ల‌ను సీరియస్‌గా తీసుకున్నాడు. తన కెరీర్‌లో రెండో మ్యాచ్ మాత్రమే ఆడుతున్న నితీష్ కేవలం 34 బంతుల్లో 74 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో రింకూ సింగ్‌తో కలిసి 49 బంతుల్లో 108 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ భాగస్వామ్యం ఆధారంగా భారత్ బ్యాడ్ స్టార్ట్ నుంచి కోలుకుని భారీ స్కోర్ దిశ‌గా వెళ్లింది.

నితీష్ భారత ఇన్నింగ్స్‌లో 13వ ఓవర్‌లో 26 పరుగులు రాబ‌ట్టాడు. మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో భారీ హిట్ అందుకున్నాడు. బ్యాటింగ్ చేసిన తర్వాత నితీష్ బౌలింగ్‌లో కూడా తన చేతివాటం ప్రదర్శించాడు. అతని పేరు మీద రెండు వికెట్లు తీసుకున్నాడు. మహ్మదుల్లా, తంజిమ్ హసన్ వికెట్లను తీసుకున్నాడు.

  Last Updated: 10 Oct 2024, 10:15 AM IST