Team India New Jersey: టీమిండియాకు కొత్త జెర్సీ…బీసీసీఐపై ఫాన్స్ ఫైర్

భారత క్రికెట్ జట్టు కొత్త లుక్ తో కనిపించబోతోంది. టీ ట్వంటీ ఫార్మాట్ లో టీమిండియా కోసం బీసీసీఐ కొత్త జెర్సీ విడుదల చేసింది.

  • Written By:
  • Publish Date - September 18, 2022 / 11:55 PM IST

భారత క్రికెట్ జట్టు కొత్త లుక్ తో కనిపించబోతోంది. టీ ట్వంటీ ఫార్మాట్ లో టీమిండియా కోసం బీసీసీఐ కొత్త జెర్సీ విడుదల చేసింది. ఇటీవల ఆసియాకప్ టోర్నీలో భారత్ ఆటగాళ్లు ధరించిన జెర్సీతో పోలిస్తే కొత్త జెర్సీ కొద్దిగా నీలిరంగు షేడ్ కలిగి ఉంది. వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ ట్వంటీ ప్రపంచ కప్‌కు ఒక నెల ముందు, ఈ కొత్త జెర్సీని బీసీసీఐ విడుదల చేసింది. అయితే ఈ జెర్సీని టీమిండియా ఆటగాళ్లు సెప్టెంబర్ 20 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్ నుంచే ధరించనున్నారు. బీసీసీఐ కొత్తగా విడుదల చేసిన జెర్సీ 2007 టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భారత్ జెర్సీకి దగ్గరగా ఉంది. ఇటీవల ఆసియాకప్ టోర్నీలో భారత్ ఆటగాళ్లు ధరించిన జెర్సీతో పోలిస్తే కొత్త జెర్సీ కొద్దిగా నీలిరంగు షేడ్ కలిగిఉంది. చేతులు, షోల్డర్ డార్క్ బ్లూ కలర్ లో ఉండగా, జెర్సీపై గీతలు వచ్చాయి.

అయితే జెర్సీ విషయంలో ఫాన్స్ హ్యాపీ గానే ఉన్నా..ఒక విషయంలో బీసీసీఐ తీరుపై ఫాన్స్ గుర్రుగా ఉన్నారు. ఫోటో షూట్ లో విరాట్ కోహ్లీ లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త జెర్సీకి సంబంధించిన ఫోస్టర్ లో వరుసగా పురుషులు, మహిళల జట్టు కెప్టెన్లు రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్‌కౌర్ ఉన్నారు. వారిపక్కన సూర్యకుమార్ యాదవ్, షపాలీ వర్మ, హార్ధిక్ పాండ్యా, రేణుకా సింగ్ ఉన్నారు. మాజీ కెప్టెన్ అయిన కోహ్లీ ఈ ఫోటోలో లేకపోవడం అందరినీ ఆశ్చర్య పరిచింది. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రోజు నుంచీ బీసీసీఐకి, కోహ్లీకి మధ్య ఏదో జరిగిందన్న ప్రచారం నడిచింది. ఇప్పుడు మరోసారి ఇలాంటి వాదనా తెరపైకి వచ్చింది. కొత్త జెర్సీ ఫోటోలో కోహ్లీ ఎందుకు లేడని ఫాన్స్ ప్రశ్నిస్తున్నారు.