Team India: టెస్టు క్రికెట్ లో టీమిండియా ఛేదించిన అత్యధిక లక్ష్యం ఎంతంటే..?

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా 444 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా (Team India) ముందు ఉంచింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 270 పరుగులు చేసి డిక్లేర్ చేసింది.

  • Written By:
  • Publish Date - June 11, 2023 / 06:57 AM IST

Team India: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా 444 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా (Team India) ముందు ఉంచింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 270 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. కంగారూ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులు చేసింది. బదులుగా భారత జట్టు 296 పరుగులు మాత్రమే చేయగలిగింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత జట్టు నాలుగో ఇన్నింగ్స్‌లో 3 సార్లు 400 కంటే ఎక్కువ పరుగులు చేసింది. ఇందులో ఒక మ్యాచ్‌లో గెలిచిన, ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. 1978లో అడిలైడ్‌లో ఆస్ట్రేలియాపై నాలుగో ఇన్నింగ్స్‌లో 445 పరుగుల భారీ స్కోరు చేసింది. 1976లో వెస్టిండీస్‌పై భారత్ 403 పరుగుల భారీ లక్ష్యాన్ని సాధించింది. టెస్టుల్లో టీమిండియా సాధించిన అతిపెద్ద విజయవంతమైన పరుగుల చేజ్ కూడా ఇదే.

ఇది 1976లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 403 పరుగులను ఛేదించడం ద్వారా భారత్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. 2008లో భారత్ రెండో అత్యధిక టెస్ట్ పరుగుల చేజ్ ను విజయవంతంగా పూర్తి చేసింది. చెన్నైలో ఇంగ్లండ్‌పై టీమ్ ఇండియా 384 పరుగులను విజయవంతంగా ఛేదించింది.

Also Read: WTC Final 2023: కొడతారా…పడతారా.. ?

విరాట్ కోహ్లీ రికార్డులు

మరోవైపు.. విరాట్ కోహ్లీ లండన్‌లోని ఓవల్‌లో ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో తొందరగానే ఔట్ అయిన కోహ్లి రెండో ఇన్నింగ్స్‌లో మంచి టచ్‌లో కనిపించాడు. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేస్తూ ఎన్నో భారీ రికార్డులు సృష్టించాడు. WTC ఫైనల్‌లో భారత జట్టు తన నాలుగో, రెండవ ఇన్నింగ్స్‌ ఆడుతోంది.

444 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు నాలుగో రోజు ముగిసే సమయానికి 3 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఇప్పుడు చివరి రోజు టీమిండియా విజయానికి 280 పరుగులు చేయాల్సి ఉంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి క్రీజులో విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే ఉన్నారు. కోహ్లి 44, రహానే 20 పరుగుల వ్యక్తిగత స్కోరు చేశారు. ఈ 44 పరుగులతో కోహ్లీ కొన్ని రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

– ఐసీసీ నాకౌట్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు.
– ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా కోహ్లీ నిలిచాడు.
– ఐసీసీ ఫైనల్స్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.
– ఆస్ట్రేలియాతో ఆడుతున్నప్పుడు అంతర్జాతీయంగా 5000 పరుగుల మార్కును అధిగమించాడు. అతను 5003 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాపై అంతర్జాతీయంగా అత్యధిక పరుగులు చేసిన రెండో భారత ఆటగాడు కోహ్లీ. సచిన్ టెండూల్కర్ 6707 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.
– దీంతో పాటు ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్‌లు ఆడుతూ కోహ్లీ 2000 పరుగుల మార్క్‌ను దాటాడు. టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై అత్యధిక పరుగులు చేసిన ఐదో భారత ఆటగాడు కోహ్లీ. విరాట్ ఇప్పటివరకు 2037 పరుగులు పూర్తి చేశాడు. ఇక ఛెతేశ్వర్ పుజారా 2074 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 3630 పరుగులతో నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు.