World Test Championship: రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 2 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన దక్షిణాఫ్రికా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో (World Test Championship) ఫైనల్‌కు కూడా అర్హత సాధించింది. ఈ సిరీస్‌లో రెండో మ్యాచ్ జనవరి 3న జరగనుంది. దక్షిణాఫ్రికా క్వాలిఫై అయిన తర్వాత WTC ఫైనల్స్‌కు చేరుకోవడం టీమ్ ఇండియాకు కష్టంగా మారింది. అయితే టీం ఇండియా ఇంకా ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించలేదు. WTC ఫైనల్స్‌కు టీమ్ ఇండియా ఎలా చేరుకోగలదో ఇప్పుడు తెలుసుకుందాం.
WTC ఫైనల్స్‌కు టీమ్ ఇండియా ఎలా చేరుకోగలదు?
ఒకవేళ భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకోవాల్సి వస్తే నాలుగో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగియాలి. దీంతో పాటు సిడ్నీ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా గెలవాల్సి ఉంది. దీని తర్వాత శ్రీలంకతో జరిగే ఒక్క టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలవకుండా ఉండాలి. ఇదే సమయంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 1-1తో డ్రాగా ముగిస్తే.. టెస్టు సిరీస్‌లో శ్రీలంక 1-0తో ఆస్ట్రేలియాపై విజయం సాధిస్తే టీమిండియా దర్జాగా ఫైనల్‌కు వెళ్లగలదు. ఒకవేళ ఇతర దేశాల విజయాలపై ఆధారపడకూడదు అనుకుంటే టీమిండియా ప్రస్తుతం జరుగుతున్న నాలుగో టెస్టులో విజయం సాధించాలి. అలాగే సిడ్నీలో జరగబోయే ఐదో టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించాలి. అప్పుడు సిరీస్‌ను టీమిండియా 3-1తో కైవసం చేసుకుని నేరుగా ఫైనల్‌కు అర్హ త సాధిస్తుంది.
Also Read: India vs Australia: మెల్‌బోర్న్ టెస్టుకు భారీ సంఖ్యలో అభిమానులు
ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ మూడు మ్యాచ్‌ల తర్వాత 1-1తో సమమైంది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అద్భుతంగా పునరాగమనం చేసి 10 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. కాగా మూడో మ్యాచ్ వర్షం కారణంగా డ్రా అయింది. ఈ సిరీస్‌లో నాలుగో మ్యాచ్ మెల్‌బోర్న్‌లో జరుగుతోంది. ఈ మ్యాచ్ కూడా డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది.