Site icon HashtagU Telugu

Team India Squad: దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా జట్టు ఎంపిక.. వన్డే, టీ20లకు రోహిత్, విరాట్ దూరం..!

Team India Squad

Compressjpeg.online 1280x720 Image 11zon

Team India Squad: వచ్చే నెలలో భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. దక్షిణాఫ్రికాలో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ పర్యటన డిసెంబర్ 10వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ముందుగా టీ20 సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత వన్డే, ఆపై టెస్టు సిరీస్‌లు ఆడనున్నారు. దక్షిణాఫ్రికా టూర్‌కు భారత జట్టు (Team India Squad)ను బీసీసీఐ గురువారం ప్రకటించింది. మూడు ఫార్మాట్ల సిరీస్‌లో వేర్వేరు కెప్టెన్‌లు ఎంపికయ్యారు. టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్, వన్డే సిరీస్‌లో కేఎల్ రాహుల్, టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టు సిరీస్‌లో మాత్రమే కనిపిస్తారు. ఈ స్టార్ బ్యాట్స్‌మెన్ ఇద్దరూ వన్డే, టీ20 జట్టులో లేరు. వీరిద్దరూ వైట్ బాల్ సిరీస్‌కు దూరంగా ఉన్నారని బీసీసీఐ తెలిపింది. కాగా ప్రపంచకప్‌లో విధ్వంసం సృష్టించిన మహ్మద్ షమీ కేవలం టెస్టు జట్టులో మాత్రమే ఎంపికయ్యాడు. BCCI అధికారులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి అప్‌డేట్ ఇస్తున్నప్పుడు.. “రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పర్యటన (ODI, T20 సిరీస్) వైట్ బాల్ దశ నుండి విరామం తీసుకోవాలని బోర్డుని అభ్యర్థించారు” అని చెప్పారు.

Also Read: Wedding Cake: వజ్రాలు, ముత్యాలతో 120కిలోల వెడ్డింగ్ కేక్.. ధరెంతో తెలిస్తే నోరెళ్లబెడతారు

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కోసం భారత జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ.

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కోసం భారత జట్టు

రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పాటిదార్, రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, దీపక్ చాహర్.

We’re now on WhatsApp. Click to Join.

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం భారత జట్టు

యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్.