World Cup 2023: ఊరిస్తున్న సెంటిమెంట్

సొంత గడ్డపై ఈ సారి టీమిండియా వరల్డ్ కప్ బరిలోకి దిగనుంది. రోహిత్ శర్మ సారధ్యంలో భారత ఆటగాళ్లు సంసిద్దమవుతున్నారు

World Cup 2023: సొంత గడ్డపై ఈ సారి టీమిండియా వరల్డ్ కప్ బరిలోకి దిగనుంది. రోహిత్ శర్మ సారధ్యంలో భారత ఆటగాళ్లు సంసిద్దమవుతున్నారు. జట్టులో యువరక్తం ఎక్కువగా కనబడుతున్నది. కాస్త సీనియారిటీ ఉన్న కీలక ఆటగాళ్లు గాయాలపాలయ్యారు. ప్రస్తుతం వారు కోలుకుంటున్నారు. ప్రస్తుతానికి కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మాత్రమే సేనియర్లుగా జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నారు. పుష్కరకాలం తరువాత సొంతగడ్డపై వరల్డ్ కప్ జరగనుండటంతో ట్రోఫీ లక్ష్యంగా పెట్టుకున్నారు. సొంతగడ్డపై వరల్డ్ కప్ జరగనుండడంతో టీమిండియా మీద అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు.

సెంటిమెంట్ ప్రకారం ఈసారి టీమిండియానే వరల్డ్ కప్ గెలుస్తుంది. 2011లో భారత్ వేదికగా వరల్డ్ కప్ జరగ్గా.. ధోనీ సారధ్యంలో టీమిండియా ఆ ఏడాది కప్పు గెలిచింది. 2015లో ప్రపంచ కప్‌కి ఆతిథ్యం ఇచ్చిన ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. 2019లో వరల్డ్ కప్‌ ఆతిథ్య దేశమైన ఇంగ్లాండ్ కప్పును ఎగరేసుకుపోయింది. ఈ సెంటిమెంట్ ప్రకారం ఈ ఏడాది వరల్డ్ కప్‌ను భారత్ గెలుస్తుందని పలువురు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సెంటిమెంట్ వర్కౌట్ అయితే రోహిత్ సేన వరల్డ్ కప్ గెలవడం ఖాయం. ఒకరకంగా ఈ వరల్డ్ గెలవడం చాలా అవసరం. ఈ వరల్డ్ కప్ తరువాత టీమిండియాలో కీలక ప్లేయర్లు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశముంది. వచ్చే వరల్డ్ కప్ నాటికి రోజిత్ శర్మ, కోహ్లీ జట్టులో ఉండకపోవచ్చు, గత వరల్డ్ కప్ గెలిచి సచిన్ కు అంకితం చేసినట్టే ఈ ఏడాది యువకులు వరల్డ్ కప్ గెలిచి సీనియర్లకు అంకితం చేయాలనీ ప్రతిఒక్కరు భావిస్తున్నారు.

Also Read: Pawan Wishes Mahesh: కృష్ణ అడుగుజాడల్లో నడుస్తూ, విభిన్న పాత్రల్లో మెప్పిస్తూ.. మహేశ్ కు పవన్ బర్త్ డే విషెస్!