Team INDIA Schedule 2023: టీమిండియా 2023 షెడ్యూల్‌ ఇదే..!

టీమ్ఇండియా (Team india) 2023లో ఆడనున్న మూడు సిరీస్‌ల షెడ్యూల్‌ విడుదలైంది. శ్రీలంకతో టీమ్ఇండియా  (Teamindia) జనవరి 3, 5, 7న టీ20లు, 10,12,15న వన్డేలు నిర్వహిస్తారు. న్యూజిలాండ్‌‌తో జనవరి 18, 21, 24న వన్డేలు, 27, 29, ఫిబ్రవరి 1న టీ20లు జరుగుతాయి. ఆస్ట్రేలియాతో ఫిబ్రవరి 9-13, 17-21, మార్చి 1-5, 9-13 తేదీల్లో నాలుగు టెస్టులు జరుగుతాయి. మార్చి 17, 19, 22న వన్డేలు నిర్వహిస్తారు. శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరగనున్న హోమ్ సిరీస్ షెడ్యూల్‌ను […]

Published By: HashtagU Telugu Desk
Team India Vs Aus Imresizer

Team India Vs Aus Imresizer

టీమ్ఇండియా (Team india) 2023లో ఆడనున్న మూడు సిరీస్‌ల షెడ్యూల్‌ విడుదలైంది. శ్రీలంకతో టీమ్ఇండియా  (Teamindia) జనవరి 3, 5, 7న టీ20లు, 10,12,15న వన్డేలు నిర్వహిస్తారు. న్యూజిలాండ్‌‌తో జనవరి 18, 21, 24న వన్డేలు, 27, 29, ఫిబ్రవరి 1న టీ20లు జరుగుతాయి. ఆస్ట్రేలియాతో ఫిబ్రవరి 9-13, 17-21, మార్చి 1-5, 9-13 తేదీల్లో నాలుగు టెస్టులు జరుగుతాయి. మార్చి 17, 19, 22న వన్డేలు నిర్వహిస్తారు.

శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరగనున్న హోమ్ సిరీస్ షెడ్యూల్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) గురువారం విడుదల చేసింది. జనవరిలో ప్రారంభమయ్యే, శ్రీలంకతో మూడు-మ్యాచ్‌ల T20I, మూడు-మ్యాచ్‌ల ODI సిరీస్ ఇండియా 2022-23 దేశీయ అంతర్జాతీయ సీజన్‌ను ప్రారంభించనుంది. జనవరి 3న ముంబై వేదికగా ఇండియా, శ్రీలంక మధ్య తొలి టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత జనవరి 5న పూణేలో రెండో టీ20, జనవరి 7న రాజ్‌కోట్‌లో మూడో టీ20 మ్యాచ్ జరుగుతాయి. ఆ తర్వాత జనవరి 10 నుంచి వన్డే సిరీస్ ఆరంభమవుతుంది. జనవరి 10న గౌహతిలో తొలి వన్డే జరుగుతుంది. ఆ తర్వాత జనవరి 12న కోల్‌కత్తాలో రెండో వన్డే, జనవరి 15న త్రివేండ్రం వేదికగా ఇండియా, శ్రీలంక మధ్య మూడో వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్ తర్వాత శ్రీలంక జట్టు, భారత పర్యటనను ముగించుకుని స్వదేశానికి పయనం అవుతుంది.

జనవరి 18న హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో తొలి వన్డే ఆడుతుంది టీమిండియా. జనవరి 21న రాయిపూర్ వేదికగా రెండో వన్డే, జనవరి 24న ఇండోర్ వేదికగా ఆఖరి వన్డే జరుగుతాయి. జనవరి 27న రాంచీ వేదికగా ఇండియా, న్యూజిలాండ్ మధ్య తొలి టీ20 ప్రారంభం అవుతుంది. జనవరి 29న లక్నోలో రెండో టీ20 ఆడే భారత జట్టు, ఆ తర్వాత ఫిబ్రవరి 1న అహ్మదాబాద్‌లో ఆఖరి టీ20 ఆడుతుంది. ఈ మ్యాచ్‌తో న్యూజిలాండ్ సిరీస్ ముగుస్తుంది.

Also Read: Google Search: గూగుల్‌లో సత్తా చాటిన సౌత్ సినిమాలు.. టాప్ 10లో మనవి ఎన్నంటే..?

ఫిబ్రవరి 9 నుంచి ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడబోతోంది భారత క్రికెట్ జట్టు. నాగ్‌పూర్ వేదికగా ఫ్రిబవరి 9న తొలి టెస్టు ఆరంభమవుతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 17న ఢిల్లీలో రెండో టెస్టు, మార్చి 1న ధర్మశాలలో మూడో టెస్టు, మార్చి 9న అహ్మదాబాద్‌లో ఆఖరి టెస్టు మ్యాచ్ జరుగుతాయి. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి అర్హత సాధించేందుకు ఈ టెస్టు సిరీస్ విజయం టీమిండియాకి చాలా కీలకం. మార్చి 17న ముంబైలో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే జరుగుతుంది. ఆ తర్వాత మార్చి 19న వైజాగ్‌లో రెండో వన్డే, మార్చి 22న చెన్నైలో మూడో వన్డే జరుగుతాయి.

  Last Updated: 08 Dec 2022, 02:07 PM IST