Site icon HashtagU Telugu

Viral Video: రోట్ నెస్ట్ ద్వీపంలో ఎంజాయ్ చేస్తున్న టీమిండియా ఆటగాళ్లు…వైరల్ వీడియో..!!

Virat

Virat

టీ20 ప్రపంచకప్ కు ముందు టీమిండియా ఆటగాళ్లందరూ రిఫ్రెష్ అవుతున్నారు. అక్టోబర్ 23న టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. దీనికి ముందు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్ లు కూడా ఆడాల్సి ఉంది. మంగళవారం టీమిండియా ఆటగాళ్లు సిబ్బందితో కలిసి పెర్త్ కు 19కిలోమీటర్ల దూరంలో ఉన్న రోట్ నెస్ట్ ద్వీపాన్ని సందర్శించారు. అక్కడ ఆటగాళ్లు ఎంజాయ్ చేసిన వీడియోలను ఫొటోలను బీసీసీఐ ట్విట్టవర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది.

ఈ వీడియాలో టీమిండియా ఆటగాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అర్ష్ దీప్ సింగ్ లతోపాటు ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా ఉన్నారు. ఇక వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ డ్యాన్స్ చేస్తూ తెగ ఎంజాయ్ చేశాడు. కామన్ వెల్త్ తర్వాత ఇండియాలో ట్రెండ్ లోకి వచ్చిన లాన్ బాల్ ను టీమిండియా ఆటగాళ్లు ఆడుతూ సరదాగా గడిపారు. ఇప్పుడా వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.