Site icon HashtagU Telugu

MS Dhoni: టీమిండియా or CSK ? ధోనీ అదిరిపోయే ఆన్సర్

Ms Dhoni (1)

Ms Dhoni (1)

MS Dhoni: ధోనీ ప్రస్తుతం ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు. మిగతా ఫార్మేట్లకు ధోని రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలియసిందే. ప్రస్తుతం మాహీ ప్రయివేట్ యాడ్స్  చేస్తున్నాడు. మరియు పూర్తి సమయాన్ని కుటుంబంతో గడుపుతున్నాడు. తాజాగా మాహి చెన్నైలోని ఓ ప్రయివేట్ కార్యక్రమంలో పాల్గొన్నాడు.

కార్యక్రమానికి వచ్చిన ప్రేక్షకుడు ధోనీని ఓ ప్రశ్న అడిగాడు. మీకు టీమిండియా ఇష్టమా సిఎస్కె ఇష్టమా అని. దానికి ధోనీ అదిరిపోయే సమాధానం ఇచ్చాడు. వందశాతం టీమిండియా అని అయితే చెన్నై సూపర్ కింగ్స్ ని ఇష్టపడే వారు భారత్ ను కూడా ఇష్టపడతారు అంటూ చాలా లాజికల్ ఆన్సర్ ఇచ్చాడు.

ఇక ఈ కార్యక్రమంలో ఎంఎస్ ధోని వచ్చే ఏడాది ఐపీఎల్ మ్యాచ్‌ల్లో పాల్గొంటానని పరోక్షంగా తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవంబర్‌ నాటికి పూర్తి ఫిట్‌నెస్‌ పొందుతానని చెప్పారు. గత ఐపీఎల్ మ్యాచ్‌లో అతను చీలమండ గాయంతో బాధపడ్డాడు. దీంతో ఐపీఎల్ సిరీస్‌లో ట్రోఫీ గెలిచిన తర్వాత ధోనీకి శస్త్రచికిత్స జరిగింది. ఇప్పుడు ఆ గాయం నుంచి కోలుకుని ఫిట్‌గా ఉన్నట్లు ప్రకటించడంతో వచ్చే ఐపీఎల్ సిరీస్‌లోనూ సీఎస్‌కే జట్టుకు నాయకత్వం వహించడం ఖాయంగా కనిపిస్తుంది. .

Also Read: Glowing Skin: క్షణాల్లో ముఖంపై అద్భుతమైన మెరుపు పొందండిలా..!