Site icon HashtagU Telugu

IND vs AUS: చెన్నైకు చేరుకున్న టీమిండియా.. ఆసీస్ ను ఓడించడమే లక్ష్యంగా ప్రాక్టీస్

Team India New Feb 2

Team India New Feb 2

IND vs AUS: ఐసీసీ వన్డే ప్రపంచకప్ నేటి (అక్టోబర్ 5) నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీ ప్రారంభ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. అక్టోబర్ 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో రోహిత్ అండ్ కంపెనీ ప్రాక్టీస్ ను మొదలుపెట్టింది. ఇటీవల, రెండు జట్లు కూడా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తలపడ్డాయి. ఇక్కడ భారత్ 2-1తో వన్డే సిరీస్‌ను గెలుచుకుంది.

ICC ODI ప్రపంచ కప్ 2023 మొదటి మ్యాచ్ ఆడేందుకు భారతదేశం-ఆస్ట్రేలియా జట్లు చెన్నై చేరుకున్నాయి. NIA షేర్ చేసిన ఈ వీడియోలో, చెన్నై విమానాశ్రయంలో భారతీయ ఆటగాళ్లు కనిపిస్తున్నారు. వీడియోలో విరాట్ కోహ్లీ చాలా రాయల్ అవతార్‌లో కనిపిస్తున్నాడు. విరాట్ కోహ్లీతో పాటు హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ సహా క్రికెటర్లందరూ వైరల్ వీడియోలో కనిపిస్తున్నారు.

అక్టోబర్ 8న ICC ప్రపంచ కప్ 2023లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌తో ఇరు జట్లు కూడా ప్రపంచకప్‌ ను ఘనంగా ఆరంభించాలని కోరుకుంటున్నాయి. వార్మప్ మ్యాచ్‌లో కంగారూ జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉంది. పాట్ కమిన్స్ సారథ్యంలో ఆస్ట్రేలియా 17 పరుగుల తేడాతో పాక్ జట్టును ఓడించింది. ICC ODI ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-1తో గెలుచుకుంది. టీమిండియా అద్భుత ప్రదర్శన చేసి తొలి 2 మ్యాచ్‌ల్లో కంగారూ జట్టును ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే గత మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు అద్భుత ప్రదర్శన చేసి విజయం సాధించింది. ఇక మొదటి మ్యాచ్ లో ఆసీస్ ను ఓడించి ప్రపంచ కప్ విజయాలను ఘనంగా ప్రారంభించాలని టీమిండియా కోరుకుంటుంది.