Site icon HashtagU Telugu

Team India Dance: టీమిండియా కాలా చష్మా సెలబ్రేషన్స్

Dance Team Imresizer

Dance Team Imresizer

జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా మూడో వన్డే ముగిసిన తర్వాత సంబరాల్లో మునిగిపోయింది. డ్రెస్సింగ్ రూంలో భారత క్రికెటర్లు తమ డాన్సులతో ఎంజాయ్ చేశారు. శిఖర్‌ ధావన్‌, శుబ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌ సహా మిగతా ఆటగాళ్లు బాలీవుడ్‌ పాపులర్‌ పాట కాలా చష్మా పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు. ముఖ్యంగా ధావన్‌, మ్యాచ్‌ హీరో శుబ్‌మన్‌ గిల్‌ కాలా చష్మా సిగ్నేచర్‌ స్టెప్పులతో దుమ్మురేపారు.

ఇషాన్ కిషన్, సిరాజ్ కూడా ఈ పాట సిగ్నేచర్ మూమెంట్స్ కు అద్భుతంగా కాలు కదిపారు. ఈ వీడియోనూ ధావన్‌ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా.. కొద్ది క్షణాల్లోనే వైరల్‌ గా మారింది. కాలా చస్మా ట్రెండ్‌ అంటూ హ్యాష్‌ ట్యాగ్‌ జత చేసిన ధావన్‌.. సెలబ్రేషన్‌ మూడ్‌ అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. సెంచరీ హీరో గిల్‌ అయితే సంతోషంలో మునిగిపోయి తనదైన డ్యాన్స్‌ మూమెంట్స్‌తో ఉర్రూతలూగించాడు.
తొలి రెండు వన్డేల్లో ఈజీగా గెలిచిన భారత్ కు చివరి మ్యాచ్ లో మాత్రం జింబాబ్వే గట్టి పోటీనిచ్చింది. ఒక దశలో సంచలన విజయం సాధించేలా కనిపించింది. అయితే చివరి రెండు ఓవర్లలో భారత్ బౌలర్లు పుంజుకుని కట్టడి చేశారు . దీంతో టీమిండియా 13 రన్స్ తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది.