Site icon HashtagU Telugu

Asia Cup : ఫలించిన రోహిత్ వ్యూహం…పాక్ 147 పరుగులకు ఆలౌట్..!!!

India

India

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. 147 పరుగులకే దాయాది జట్టును ఆలౌట్ చేశారు. టాస్ గెలిచి భారత్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బరిలోకి దిగిన పాక్‌ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించినా ఈ సారి సక్సెస్ కాలేకపోయింది. ఆరంభంలోనే కెప్టెన్ బాబర్ ఆజామ్‌ను ఔట్ చేయడం ద్వారా భువనేశ్వర్ కుమార్ ఫస్ట్ బ్రేక్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి పాక్ వికెట్లను భారత్ క్రమం తప్పకుండా పడగొట్టింది. ఫకర్ జమాన్ 10 పరుగులకు ఔటయ్యాడు. అయితే ఓపెనర్ రిజ్వాన్, ఇఫ్తికర్ అహ్మద్ పార్టనర్‌షిప్‌తో పాక్ కాస్త కోలుకుంది.

రిజ్వాన్ 43 రన్స్ చేయగా… ఇఫ్తికర్ 28 పరుగులు చేశాడు. 14 ఓవర్ నుంచి హార్థిక్ పాండ్యా వరుసగా పాక్‌ను దెబ్బకొట్టాడు. కీలక వికెట్లతో పాక్ స్కోరుకు కళ్ళెం వేశాడు. అటు అర్షదీప్‌సింగ్ కూడా రాణించడంతో పాక్ వేగంగా పరుగులు చేయలేకపోయింది. చివర్లో పాక్ టెయిలెండర్లు రవూఫ్ 7 బంతుల్లో 13 , షాన్వాజ్ 6 బంతుల్లో 16 పరుగులు చేయడంతో పాక్ స్కోర్ 140 దాటింది. చివర్లో అర్షదీప్‌సింగ్ షాన్వాజ్‌ను ఔచ్చేయడంతో పాక్ ఇన్నింగ్స్‌కు 19.5 ఓవర్లలో 147 పరుగులకు తెరపడింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ 4 ఓవర్లలో 26 పరుగులకు 4 వికెట్లు పడగొట్టగా… పాండ్యా 25 రన్స్‌కు 3 వికెట్లు తీశాడు. అర్షదీప్‌కు 2 , అవేశ్ ఖాన్ 1 వికెట్ పడగొట్టారు.