Ravichandran Ashwin: చెలరేగిన అశ్విన్.. అరుదైన రికార్డు సొంతం

టెస్టు క్రికెట్ చరిత్రలో భారత ఆటగాళ్లు ఎన్నో రికార్డులు నెలకొల్పారు.

  • Written By:
  • Updated On - July 14, 2023 / 11:37 AM IST

Ravichandran Ashwin: అంతర్జాతీయ టెస్టు క్రికెట్ చరిత్రలో భారత ఆటగాళ్లు ఎన్నో రికార్డులు నెలకొల్పారు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో ఉత్తమ గణంకాలను నమోదు చేశారు. తాజాగా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 700 అంతర్జాతీయ వికెట్ల క్లబ్ లో చోటు సంపాదించాడు. వెస్టిండీస్ తో తొలిటెస్టు తొలిరోజుఆటలోనే ఈ ఘనత సాధించాడు. భారత స్పిన్ జాదూ , 36 ఏళ్ళ రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన ఘనతను సాధించాడు. నెలరోజుల విరామం తర్వాత తొలిసారిగా టెస్టుమ్యాచ్ లో పాల్గొన్న ఈ వెటరన్ స్పిన్నర్ కరీబియన్ టూర్ లో సైతం తన జోరు కొనసాగించాడు.

ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా వెస్టిండీస్ తో ప్రారంభమైన రెండుమ్యాచ్ ల సిరీస్ లోనే తొలిటెస్టు తొలిరోజు ఆటలోనే అశ్విన్ తన మ్యాజిక్ ప్రదర్శించాడు.  కరీబియన్ ద్వీపాలలోని డోమనికా రోసో స్టేడియం వేదికగా ప్రారంభమైన తొలిటెస్టు తొలిరోజునే అశ్విన్ చెలరేగిపోయాడు. విండ్సర్ పార్క్ పిచ్ నుంచి లభించిన కొద్దిపాటి మద్దతును అశ్విన్ అనుకూలంగా మార్చుకొన్నాడు.

చక్కటి లైన్ అండ్ లెంగ్త్ కు తగిన స్పిన్, ఫ్లైట్ ను జోడించడం ద్వారా కరీబియన్ బ్యాటర్లను అశ్విన్ బెంబేలెత్తించాడు. 24 ఓవర్లలో 60 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. టెస్టు క్రికెట్ ఓ ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టడం అశ్విన్ కు ఇది 33వసారి. మూడో భారత స్పిన్నర్ అశ్విన్…. వెస్టిండీస్ బ్యాటర్ అల్జారీ జోసెఫ్ ను అవుట్ చేయడం ద్వారా అశ్విన్ తన అంతర్జాతీయ వికెట్ల సంఖ్యను 700కు పెరిగింది. అశ్విన్ మెరుగైన ప్రదర్శన ఇవ్వడం బ్యాటింగ్ లోనూ దుమ్మురేపుతున్నారు మనోళ్లు.