Site icon HashtagU Telugu

NZ vs IND Semifinal : టీమిండియా చారిత్రాత్మక విజయం..న్యూజిలాండ్ ను చావుదెబ్బ కొట్టిన షమీ

team-india-beat-new-zealand-in-world-cup-semi-final

team-india-beat-new-zealand-in-world-cup-semi-final

ముంబై వేదికగా జరిగిన తొలి సెమి ఫైనల్ (NZ vs IND Semifinal) లో భారత్ (India) చారిత్రాత్మక విజయం సాధించింది. 398 పరుగుల లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన న్యూజిలాండ్ (New Zealand) చివరి వరకు పోరాడింది. ఒకానొక దశలో న్యూజిలాండ్ విజయం సాదిస్తుందని భావించినప్పటికీ మహమ్మద్ షమీ (Mohammed Shami) కీలక వికెట్లు పడగొట్టి మ్యాచ్ ని మలుపు తిప్పాడు. ప్రమాదకర ఇన్నింగ్స్ ఆడుతున్న కెన్ విలియమ్సన్ , డారిల్ మిచెల్ ఆటగాళ్లను కీలక సమయంలో పడగొట్టి న్యూజిలాండ్ ను చావుదెబ్బ కొట్టాడు. డారెల్‌ మిచెల్‌ వీరబాదుడు బాదుతుండటంతో కొండంత లక్ష్యం కూడా కరిగిపోతున్న తరుణంలో మహ్మద్‌ షమీ మాయ చేశాడు. వరుసగా రెండు వికెట్లు తీసి కివీస్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. కేన్‌ విలిమయ్సన్‌తో పాటు టామ్‌ లాథమ్‌ కూడా ఔట్‌ అవడంతో భారత శిబిరంలో మళ్లీ ఆశలు చిగురించాయి

We’re now on WhatsApp. Click to Join.

ఆరో ఓవర్ లో న్యూజిలాండ్ ఓపెనర్ డెవోన్ కాన్వే వికెట్ తో షమీ దండయాత్ర మొదలైంది. 8 ఓవర్ 4 బంతికి షమీ రెండో వికెట్ తీశాడు. న్యూజిలాండ్ డేంజరస్ బ్యాటర్ రచిన్ రవీంద్రను స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేర్చాడు. మైదానంలో అడుగుపెట్టిన కెన్ విలియమ్సన్ , డారిల్ మిచెల్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. విలియమ్సన్ 73 బంతుల్లో 63 పరుగులతో సత్తా చాటాడు. డారిల్ మిచెల్ 119 బంతుల్లో 134 పరుగులతో భారీ ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో ఫిలిప్స్ అవుట్ అవ్వడంతో టీమిండియా విజయం ఖాయమైంది. ఈ కీలక వికెట్ ను బుమ్రా పడగొట్టాడు. ఆ తర్వాత వచ్చిన ఏ ఒక్కరు ప్రభావం చూపించలేకపోవడంతో వెంటవెంటనే వికెట్లు సమర్పించుకున్నారు. షమీ 7 వికెట్లతో సత్తాచాటగా బుమ్రా, కుల్దీప్ , సిరాజ్ తలో వికెట్ తీసుకున్నారు.

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఓపెనర్లు రోహిత్ 47 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడి గట్టి పునాది వేశాడు. మరో ఎండ్ లో గిల్ 80ఇక కోహ్లీ 117 భారీ స్కోర్ చేసి చరిత్ర సృష్టించాడు. శ్రేయాస్ అయ్యర్ 105 పరుగులతో మరో గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో కేఎల్ రాహుల్ 39 పరుగులతో రాణించాడు. ఓవరాల్ గా టీమిండియా 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 స్కోర్ చేయగా, న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈ చారిత్రాత్మక విజయంతో టీమిండియా ఫైనల్ కు చేరింది.రేపు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా రెండో సెమి ఫైనల్ లో తలపడతాయి. ఈ మ్యాచ్ లో ఏ టీం అయితే గెలుస్తుందో ఆ టీం తో భారత్ 19వ తేదీన ఆదివారం ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది.

Read Also : Virat Kohli 50th Century : కోహ్లీ సెంచరీ ఫై సచిన్..మోడీ రియాక్షన్