Hardik Pandya Net Worth: క్రికెటర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya Net Worth) గత కొన్ని నెలలుగా హెడ్‌లైన్స్‌లో కొనసాగుతున్నాడు. తొలుత పాండ్యాను గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ అట్టిపెట్టుకుంది. దీని తర్వాత రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాకు ఎంఐని నడిపించే బాధ్యతను అప్పగించారు. హార్దిక్ కెప్టెన్సీలో MI ప్రదర్శన చాలా ఘోరంగా ఉంది. జట్టు 14 మ్యాచ్‌లలో 4 మాత్రమే గెలవగలిగింది. ఇలాంటి పరిస్థితుల్లో హార్దిక్.. అభిమానుల ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది. ఇప్పుడు హార్దిక్ పాండ్యా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి వార్తల్లో నిలిచాడు.
హార్దిక్-నటాష్ విడాకుల వార్తలు
పాండ్యా అతని భార్య నటాషా స్టాంకోవిచ్ విడాకుల వార్త చర్చనీయాంశంగా ఉంది. ప్రస్తుతం ఈ జంట విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే వీరిద్దరు తమ రిలేషన్ షిప్ గురించి ఇంతవరకు బహిరంగంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. హార్దిక్-నటాషా విడాకులు తీసుకుంటే పాండ్యా తన ఆస్తిలో 70 శాతం నటాషాకు ఇవ్వాల్సి ఉంటుందని కూడా కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.
Also Read: Kolkata vs Hyderabad: నేడే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్.. హైదరాబాద్‌పై కోల్‌కతాదే పైచేయి..!
హార్దిక్ పాండ్యా నికర విలువ గురించి మాట్లాడుకుంటే.. ఒకప్పుడు 200 రూపాయలకు టోర్నీలు ఆడిన హార్దిక్ పాండ్యా నేడు కోట్ల ఆస్తికి యజమాని. మీడియా కథనాల ప్రకారం అతని మొత్తం సంపద దాదాపు రూ.91 కోట్లు. క్రికెట్‌తో పాటు ప్రకటనల ద్వారా చాలా సంపాదిస్తున్నాడు. తాజాగా బీసీసీఐ కాంట్రాక్ట్‌ను ప్రకటించింది. హార్దిక్‌కు గ్రేడ్-ఎలో చోటు కల్పించారు. ఇలాంటి పరిస్థితిలో ఈ ఏడాది బోర్డు నుంచి రూ.5 కోట్లు పాండ్యాకు రానున్నాయి.
We’re now on WhatsApp : Click to Join
IPL, ప్రకటనల నుండి ఆదాయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా హార్దిక్ పాండ్యా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నాడు. 17వ సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ అతడిని గుజరాత్ టైటాన్స్‌తో రూ.15 కోట్లకు ట్రేడ్ చేసింది. గతంలో ఐపీఎల్ 2022, ఐపీఎల్ 2023 కోసం గుజరాత్ టైటాన్స్ హార్దిక్‌కు ఒక్కో సీజన్‌కు రూ.15 కోట్లు ఇచ్చింది. బోట్, అమెజాన్ అలెక్సా, రిలయన్స్ రిటైల్, స్టార్ స్పోర్ట్స్ మాన్స్టర్ ఎనర్జీ, బ్రిటానియా బోర్బన్, సిన్ డెనిమ్, గల్ఫ్ ఆయిల్ ఇండియా, డ్రీమ్ 11, యాక్సిలరేట్, సోల్డ్ స్టోర్, SG క్రికెట్, POCO వంటి బ్రాండ్‌లను హార్దిక్ ప్రమోట్ చేస్తున్నాడు.
ఈ బ్రాండ్ల నుంచి హార్దిక్‌కు భారీ మొత్తం వస్తుంది. ఇది మాత్రమే కాదు హార్దిక్‌కు ముంబైలోని బాంద్రాలో రూ. 30 కోట్ల విలువైన ఇల్లు ఉంది. వడోదరలో అతనికి విలాసవంతమైన ఇల్లు కూడా ఉంది. ఆల్ రౌండర్ క్రికెటర్ కార్ల సేకరణ గురించి మాట్లాడుకుంటే.. ఇందులో ఆడి A6, రేంజ్ రోవర్ వోగ్, జీప్ కంపాస్, మెర్సిడెస్ G వ్యాగన్, రోల్స్ రాయిస్, లంబోర్ఘిని హురాకాన్ EBO, పోర్స్చే కయెన్, టయోటా ఎటియోస్ ఉన్నాయి.