Site icon HashtagU Telugu

Tamim Iqbal: అరుదైన రికార్డ్ సృష్టించిన తమీమ్ ఇక్బాల్.. తొలి బంగ్లాదేశ్ క్రికెటర్ గా ఘనత..!

Tamim Iqbal

Resizeimagesize (1280 X 720) (3)

బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ (Tamim Iqbal) అంతర్జాతీయ క్రికెట్‌లో 15,000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన బంగ్లా తరుపున మొదటి ఆటగాడిగా నిలిచాడు. 2007లో బంగ్లాదేశ్ తరఫున అరంగేట్రం చేసిన తమీమ్ ఇక్బాల్ ఐర్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో 31 బంతుల్లో 23 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 15,000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ప్రపంచంలో 40వ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ 383 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 15,009 పరుగులు చేశాడు. తమీమ్‌ 69 టెస్టుల్లో 5,082 పరుగులు, 236 వన్డేల్లో 8,169 రన్స్‌, 78 టీ20ల్లో 1,758 పరుగులు చేశాడు. మూడు ఫార్మెట్లలో కలిపి తమీమ్‌ 25 సెంచరీలు చేశాడు.

ఐర్లాండ్‌తో సోమవారం జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ వెటరన్ బ్యాట్స్‌మెన్ ముష్ఫికర్ రహీమ్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ చివరి బంతికి రహీమ్‌ సెంచరీ పూర్తి చేశాడు. బంగ్లాదేశ్‌లో అత్యంత వేగంగా వన్డే సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా ముష్ఫికర్ రహీమ్ నిలిచాడు. రహీమ్ 60 బంతుల్లో 14 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. అతని వన్డే కెరీర్‌లో ఇది 9వ సెంచరీ. రహీమ్ కంటే ముందు బంగ్లాదేశ్‌ నుంచి ఫాస్టెస్ట్ వన్డే సెంచరీ చేసిన రికార్డు షకీబ్ అల్ హసన్ పేరిట నమోదైంది. 2009లో బులవాయోలో జింబాబ్వేపై షకీబ్ 63 బంతుల్లో సెంచరీ సాధించాడు.

Also Read: Delhi Capitals: 54 బంతుల్లోనే లక్ష్య ఛేదన.. ముంబైని ఓడించిన ఢిల్లీ..!

ఈ ఇన్నింగ్స్‌లో ముష్ఫికర్ రహీమ్ తన వన్డే కెరీర్‌లో 7000 పరుగులు పూర్తి చేశాడు. తమీమ్ ఇక్బాల్, షకీబ్ అల్ హసన్ తర్వాత వన్డే క్రికెట్‌లో 7000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన మూడో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. వన్డే క్రికెట్‌లో 7000 పరుగులు పూర్తి చేసేందుకు ముష్ఫికర్ రహీమ్ 55 పరుగులు చేయాల్సి ఉంది. కర్టిస్ కాంఫెర్ వేసిన ఇన్నింగ్స్ 44వ ఓవర్‌లో బౌండరీని సాధించడం ద్వారా అతను ఈ సంఖ్యను అధిగమించాడు.

ముష్ఫికర్ రహీమ్‌తో పాటు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కూడా రికార్డు సృష్టించింది. వన్డే క్రికెట్‌లో బంగ్లాదేశ్‌ అతిపెద్ద స్కోరు చేసింది. సిల్హెట్‌లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. అంతకుముందు, రెండు రోజుల క్రితం ఈ మైదానంలో ఐర్లాండ్‌పై బంగ్లాదేశ్ అత్యుత్తమ స్కోరు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది.