IPL 2023: ఐపీల్ ప్రారంభోత్సవంలో సందడి చేయబోతున్న మిల్క్ బ్యూటీ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమన్నా సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి

  • Written By:
  • Publish Date - March 29, 2023 / 06:26 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమన్నా సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్ళు పూర్తి అవుతున్న ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ వరుసగా అవకాశాలను దూసుకుపోతోంది. తమన్నా ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లు యాడ్స్ లో నటిస్తూ బాగానే సంపాదిస్తోంది. ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు పలు రకాల బ్రాండ్లకు అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తోంది.

ఇది ఇలా ఉంటే అహ్మదాబాద్‌ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో శుక్రవారం నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023, 16వ సీజన్‌ ప్రారంభం కానుంది. పది జట్లు దాదాపు రెండున్నర నెలలపాటు టైటిల్‌ కోసం తలపడనున్నాయి. కాగా టాలీవుడ్‌ భామ తమన్నా భాటియా ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మార్చి 31 సాయంత్రం 6 గంటలకు మొదలయ్యే ఐపీఎల్‌ ప్రారంభ వేడుకల్లో తమన్నా ప్రదర్శన ఇవ్వనుంది. ఇదే విషయాన్నీ ఐపీఎల్‌ నిర్వాహకులు ట్విటర్ వేదికగా తెలిపారు. తమన్నాతో పాటుగా ఇంకా మరింతమంది స్టార్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా కరోనా మహమ్మారి కారణంగా దాదాపుగా రెండేళ్లపాటు నిలిచిపోయిన మ్యాచ్‌లు ఈసారి మళ్లీ అట్టహాసంగా జరగనున్నాయి. గతేడాది ఛాంపియన్‌, హార్దిక్‌ కెప్టెన్సీ లోని గుజరాత్‌ టైటాన్స్‌తో ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టు తొలి మ్యాచ్‌లో తలపడనుంది. కెప్టెన్‌గా తొలి సీజన్‌లోనే గుజరాత్‌ను హార్దిక్‌ విజేతగా నిలిపాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతోపాటు జట్టును నడిపించిన తీరు ఆకట్టుకుంది. మరోవైపు మూడేళ్ల కిందట అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ ధోనీ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఆటగాడిగా ధోనీకి ఇదే చివరి ఐపీఎల్‌ సీజన్‌గా అభిమానులు భావిస్తున్న తరుణంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.