Tamannaah and Rashmika in Modi Ilaka : ఇది కదా ఓపెనింగ్ సెర్మనీ అంటే.. ఇది కదా ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్… లక్ష మందికి పైగా అభిమానులతో కిక్కిరిసిన స్టేడియం.. ఈ హంగామాలో అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియంలో ఐపీఎల్ 16వ సీజన్ ఆరంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. బాలీవుడ్ సూపర్ స్టార్స్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు, బీసీసీఐ సభ్యులు, క్రికెటర్లతో స్టేడియంలో సందడే సందడి. ఆరంభ వేడుకల్లో ప్రముఖ హోస్ట్ మందిరాబేడీ తన వ్యాఖ్యానంతో అలరించగా…ఓపెనింగ్ సెర్మనీ అదిరిపోయింది. మొదట బాలీవుడ్ టాప్ సింగర్ అర్జీత్ సింగ్ తన గాత్రంతో స్టేడియంలో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. అయితే ఐపీఎల్ ఆరంభ వేడుకల్లో తెలుగు పాటల హవా కనిపించింది.
ట్రిపులార్ మూవీలోని నాటు నాటు పాట, పుష్ప సినిమాలోని సామి సామి, ఊ అంటావా పాటలతో మోదీ స్టేడియం దద్దరిల్లింది. స్టార్ హీరోయిన్స్ తమన్నా, రష్మిక మంధాన ఈ పాటలకు తమ హుషారైన స్టెప్పులు వేసి అలరించారు. మొత్తం ఆరంభ వేడుకల్లో ఈ ముద్దుగుమ్మలు నృత్య ప్రదర్శనలే ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఎప్పుడూ ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో బాలీవుడ్ పాటల హవానే నడుస్తుంది. అయితే ఈ మాత్రం ఎక్కువగా సౌత్ సాంగ్సే వినిపించాయి. తమన్నా భాటియా (Tamannaah) పుష్ప చిత్రంలోని ఊ అంటావా ఊఊ అంటావా సాంగ్‌కు అదిరిపోయేలే డ్యాన్స్ వేసింది. ఆ సాంగ్‌లో ఉన్న బీట్స్‌కు అనుగుణంగా కాళ్లు కదుపుతూ ప్రేక్షకుల చేతిలో విజిల్స్ వేయించింది. స్వతహాగా మంచి డ్యాన్సరైన మిల్క్ బ్యూటీ ఈ పుష్ప చిత్రంలోని సాంగ్‌కు తనదైన స్టెప్పులో అలరించింది.
ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తాను నటించిన పుష్ప చిత్రంలోని సామి సామి పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేసింది. నడుము ఊపుతూ తన హుక్ స్టెప్‌తో స్టేడియంలో అందరినీ కవ్వించింది. రష్మిక ప్రదర్శనకు అభిమానులే కాదు క్రికెటర్లు కూడా ఫిదా అయ్యారు. అలాగే ఆస్కార్ విన్నింగ్ సాంగ్ నాటు నాటు పాటకు కూడా రష్మిక తనదైన స్టెప్పులతో దుమ్మురేపింది. ఆమె స్టెప్పులకు స్టేడియంలో ప్రేక్షకులు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. మొత్తం మీద చాలా కాలం తర్వాత ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ అభిమానులను ఉర్రూతలూగించింది. ఇక ఆరంభ వేడుకలు ముగిసిన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లను స్టేజ్ పైకి వినూత్నంగా ఆహ్వానించారు. ప్రత్యేకంగా అలంకరించిన ఓపెన్ టాప్ జీప్‌లపై ముందు ధోనీ రాగా.. తర్వాత గుజరాత్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా వచ్చాడు. చివర్లో ఫైర్ వర్క్స్ కూడా ఆకట్టుకున్నాయి.
Also Read: IPL 2023 Opening Ceremony LIVE: ఐపీఎల్ కు గ్లామర్ షో.. రష్మిక, తమన్నా లైవ్ డాన్స్