Site icon HashtagU Telugu

Warm-Up Schedule: బంగ్లాదేశ్‌తో టీమిండియా వార్మప్ మ్యాచ్‌.. పూర్తి షెడ్యూల్ ఇదే..!

Indian players

Indian players

Warm-Up Schedule: టీ20 ప్రపంచకప్ 2024కి ముందు జట్లు వార్మప్ మ్యాచ్ (Warm-Up Schedule)లు ఆడతాయి. వార్మప్ మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. ఇందులో బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడనుంది. అయితే పాకిస్థాన్, ఇంగ్లండ్‌లకు వార్మప్ మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదు. మే 27 నుంచి వార్మప్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. దీని మొదటి మ్యాచ్ కెనడా- నేపాల్ మధ్య జరుగుతుంది. జూన్ 1న బంగ్లాదేశ్‌తో టీమిండియా మైదానంలోకి దిగనుంది.

నిజానికి T20 ప్రపంచ కప్ 2024కి ముందు పాకిస్తాన్, ఇంగ్లాండ్ మధ్య నాలుగు మ్యాచ్‌ల T20 సిరీస్ ఆడ‌నుంది. ఈ సిరీస్ మే 22 నుంచి మే 30 వరకు జరగనుంది. మే 27 నుంచి జూన్ 1 వరకు వార్మప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. అందువల్ల పాకిస్థాన్, ఇంగ్లండ్‌లకు వార్మప్ మ్యాచ్‌లు ఆడేందుకు సమయం దొరకదు. ఈ కారణంగానే ఇరు జ‌ట్ల పేర్ల‌ను షెడ్యూల్‌లో చేర్చలేదు. ఈ సిరీస్ కారణంగా ఇంగ్లండ్ ఆటగాళ్లు ఐపీఎల్‌ను మధ్యలోనే వదిలేసి స్వదేశానికి చేరుకున్నారు.

టీ20 ప్రపంచకప్‌కు ముందు 16 వార్మప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో మొత్తం 17 జట్లు పాల్గొంటాయి. ఈ మ్యాచ్‌లు టీ20 తరహాలో జరగనున్నాయి. మే 27న కెనడా, నేపాల్ మధ్య మ్యాచ్ జరగనుంది. అదే రోజు ఒమన్, న్యూ పాపువా గినియా మధ్య మ్యాచ్ కూడా జరగనుంది. జూన్ 1న బంగ్లాదేశ్‌తో టీమిండియా మైదానంలోకి దిగనుంది. ఈ మ్యాచ్ అమెరికాలో జరగనుంది.

Also Read: Eesha Rebba : ఎన్టీఆర్ సినిమా హీరోయిన్ అని ఒప్పించి సైడ్ క్యారెక్టర్ ఇచ్చారు.. ఇక్కడ ఎవరు లేరు కాబట్టే..!

T20 ప్రపంచ కప్ 2024 వార్మప్ మ్యాచ్ షెడ్యూల్

మే 27 సోమవారం

కెనడా vs నేపాల్, టెక్సాస్
ఒమన్ vs పాపువా న్యూ గినియా, ట్రినిడాడ్ అండ్ టొబాగో
నమీబియా vs ఉగాండా, ట్రినిడాడ్ అండ్ టొబాగో

మే 28 మంగళవారం

శ్రీలంక vs నెదర్లాండ్స్, ఫ్లోరిడా
బంగ్లాదేశ్ vs USA, టెక్సాస్
ఆస్ట్రేలియా vs నమీబియా, ట్రినిడాడ్ అండ్ టొబాగో

We’re now on WhatsApp : Click to Join

మే 29 బుధవారం

దక్షిణాఫ్రికా ఇంట్రా-స్క్వాడ్, ఫ్లోరిడా
ఆఫ్ఘనిస్తాన్ vs ఒమన్, ట్రినిడాడ్ అండ్ టొబాగో

మే 30 గురువారం

నేపాల్ vs USA, టెక్సాస్
స్కాట్లాండ్ vs ఉగాండా, ట్రినిడాడ్ అండ్ టొబాగో
నెదర్లాండ్స్ vs కెనడా, టెక్సాస్
నమీబియా vs పాపువా న్యూ గినియా, ట్రినిడాడ్ అండ్ టొబాగో
వెస్టిండీస్ vs ఆస్ట్రేలియా, ట్రినిడాడ్ అండ్ టొబాగో

మే 31 శుక్రవారం

ఐర్లాండ్ vs శ్రీలంక, ఫ్లోరిడా
స్కాట్లాండ్ vs ఆఫ్ఘనిస్తాన్, ట్రినిడాడ్ అండ్ టొబాగో

జూన్ 1 శనివారం

బంగ్లాదేశ్ vs ఇండియా, USA