Site icon HashtagU Telugu

T20 World Cup: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్‌.. ఫైన‌ల్‌కు చేరిన సౌతాఫ్రికా

T20 World Cup

T20 World Cup

T20 World Cup: అన్నెకే బాష్- కెప్టెన్ లారా వోల్వార్డ్‌ల అద్భుతమైన ఇన్నింగ్స్‌తో దక్షిణాఫ్రికా ఎనిమిది వికెట్ల తేడాతో ఆరుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించి మహిళల T20 ప్రపంచ కప్‌లో (T20 World Cup) ఫైనల్‌లోకి ప్రవేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. బాష్ అజేయ అర్ధ సెంచరీతో దక్షిణాఫ్రికా 17.2 ఓవర్లలో రెండు వికెట్లకు 135 పరుగులు చేసి లక్ష్యాన్ని సాధించింది. ఇప్పుడు ఆదివారం న్యూజిలాండ్- వెస్టిండీస్ మధ్య జరిగే రెండవ సెమీ-ఫైనల్ విజేతతో దక్షిణాఫ్రికా తలపడుతుంది.

టైటిల్ కోసం బలమైన పోటీదారుగా భావించిన ఆస్ట్రేలియా ప్రయాణం సెమీ ఫైనల్స్‌తో ముగిసింది. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు అన్ని మ్యాచ్‌లు గెలిచి సెమీఫైనల్‌కు చేరుకుంది. ఆస్ట్రేలియాదే పైచేయి అని అనుకున్నారు. ఎందుకంటే మునుపటి ఏడు T20 ప్రపంచ కప్‌లలో ఆస్ట్రేలియా ఆరుసార్లు టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్‌లో ఒకసారి ఓడిపోయింది. ఈ విధంగా ఈ విజయం దక్షిణాఫ్రికాకు చాలా పెద్దది. ఈ ఫార్మాట్‌లో ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాను దక్షిణాఫ్రికా గతంలో ఎన్నడూ ఓడించలేదు. దీంతో టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా వరుసగా 15 విజయాల పరంపర ముగిసి ఎనిమిదోసారి ఫైనల్‌లోకి అడుగుపెట్టాలన్న కల చెదిరిపోయింది. 2009 నుండి టోర్నమెంట్‌లోని మొత్తం తొమ్మిది సీజన్లలో ఆస్ట్రేలియా సెమీ-ఫైనల్ ఆడింది.

Also Read: Flexi, posters : ఫ్లెక్సీలు, పోస్టర్ల నిషేధం .. త్వరలోనే చట్టాన్ని తీసుకువస్తాం: మంత్రి నారాయణ

లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అన్నాబెల్ సదర్లాండ్ టాంజిమ్ బిట్జ్ బౌలింగ్‌లో దక్షిణాఫ్రికాకు తొలి దెబ్బను అందించింది. 15 పరుగుల వద్ద బ్రిట్జ్ ఔటయ్యాడు. అనంతరం బాష్‌, వోల్‌వోర్ట్‌లు రెండో వికెట్‌కు 96 పరుగులు జోడించారు. టీ20లో ఆస్ట్రేలియాపై ఏ వికెట్‌కైనా దక్షిణాఫ్రికా చేసిన అత్యధిక భాగస్వామ్యం ఇదే. అయితే సదర్లాండ్, వోల్వోర్ట్‌ను అర్ధ సెంచరీ చేయడానికి అనుమతించలేదు. తహ్లియా మెక్‌గ్రాత్‌కి క్యాచ్ ఇచ్చింది. 37 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 42 పరుగులు చేసి వోల్వోర్ట్ ఔటయ్యాడు. అయినప్పటికీ బాష్ తన ఇన్నింగ్స్‌ను కొనసాగించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. బాష్ 48 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 74 పరుగులు చేసి నాటౌట్ గా వెనుదిరిగింది. చోలే టైరోన్ ఒక పరుగు చేసి నాటౌట్ గా నిలిచింది.