ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ లో టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగనుంది. ఈ మెగా ఈవెంట్ కోసం ఐసీసీ ఇప్పటికే ప్రమోషన్ మొదలుపెట్టింది. టోర్నీకి ప్రచారం కల్పించే కార్యక్రమాల్లో భాగంగా వినూత్న రీతిలో ప్రపంచ వ్యాప్తంగా ట్వంటీ వరల్డ్ కప్ ట్రోఫీ టూర్ చేస్తోంది. ఇప్పటికే పలు దేశాలను చుట్టి వచ్చిన ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ ను తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్ ఆడమ్ జంపా.. స్పోర్ట్స్ ప్రెజంటర్ ఎరిన్ హోలాండ్, ఆస్ట్రేలియన్ పారాలింపిక్స్ స్విమ్మర్ గ్రాంట్ పాటర్‌సన్‌లు ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి తీసుకెళ్లారు.
ఆస్ట్రేలియాకు తలమానికంగా నిలిచే ప్రపంచంలోనే అతిపెద్ద కోరల్ రీఫ్ సిస్టమ్‌గా పిలచే గ్రేట్ బారియర్ రీఫ్‌కు టి20 ప్రపంచకప్‌ను పట్టుకెళ్లారు. ఒక గ్లాసులో టీ ట్వంటీ ప్రపంచకప్‌ను ఉంచి గ్రేట్ బారియర్ రీఫ్ నీటి అడుగుభాగంలోకి తీసుకెళ్లిన ఫోటోలను ఐసీసీ అభిమానులతో షేర్ చేసుకుంది.
టీ ట్వంటీ ప్రపంచకప్ టూర్‌లో భాగంగా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన ప్రపంచకప్ ఆస్ట్రేలియాలో ఎనిమిది రాష్ట్రాల్లో 21 నగరాలతో పాటు యూనియన్ టెర్రటరీస్‌లో సందర్శనకు రానుంది. ఆస్ట్రేలియాతో పాటు దాదాపు 12 దేశాల్లో టి20 ప్రపంచకప్ చుట్టి రానుంది. గత ఏడాది ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. ఆసీస్‌కు ఇదే తొలి టి20 ప్రపంచకప్ టైటిల్ కాగా.. న్యూజిలాండ్ రన్నరప్‌గా నిలిచింది. కాగా ఈ సారి టోర్నీకి కంగారూ దేశం ఆతిథ్యమిస్తోంది. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు జరగనున్న మెగా టోర్నీలో 12 దేశాలు పాల్గొంటున్నాయి.
A special place for a special 🏆
The ICC Men's #T20WorldCup trophy took a plunge underwater in the Great Barrier Reef, with the help of Adam Zampa and @erinvholland 🌊 pic.twitter.com/eln3mPfACI
— T20 World Cup (@T20WorldCup) July 20, 2022