T20 World Cup 2022: గాయాలు టీమిండియాను దెబ్బేసేలా ఉన్నాయే..?

ఐసీసీ నిర్వ‌హిస్తున్న టీ20 వ‌రల్డ్ క‌ప్‌ను టీమిండియా ఎలాగైనా త‌న ఖాతాలో వేసుకోవాల‌ని చూస్తోంది. కానీ టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ ప‌డుతుంది.

  • Written By:
  • Publish Date - October 12, 2022 / 10:24 PM IST

ప్రపంచకప్‌ ముందు టీమిండియా ప్లేయ‌ర్స్‌ వరుస గాయాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఐసీసీ నిర్వ‌హిస్తున్న ఈ టీ20 వ‌రల్డ్ క‌ప్‌ను టీమిండియా ఎలాగైనా త‌న ఖాతాలో వేసుకోవాల‌ని చూస్తోంది. కానీ టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ ప‌డుతుంది. ఇప్ప‌టికే గాయాల కార‌ణంగా ఇద్ద‌రు ప్లేయ‌ర్స్ దూరం అయిన విష‌యం తెలిసిందే. టీమిండియా ఆల్ రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా, ఫాస్ట్ బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా టీ20 వ‌రల్డ్ క‌ప్‌కు దూర‌మ‌య్యారు. తాజాగా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ స్టాండ్ బైగా భార‌త్ జట్టుకు ఎంపికైన దీప‌క్ చాహ‌ర్ కూడా గాయం కార‌ణంగా ఈ టోర్నీకి దూర‌మైన‌ట్లు తెలుస్తోంది.

అయితే.. ఇప్పుడు టీమిండియా అభిమానుల్లో ఆందోళ‌న మొదలైంది. టీమిండియా ఆల్ రౌండ‌ర్‌, ఇద్ద‌రు బౌల‌ర్లు గాయాల కార‌ణంగా ఈ టోర్నీకి దూరం కావ‌డంతో ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న ఎలా ఉంటుందో అని సందేహ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ఇప్ప‌టికే టీమిండియా బ్యాట్స్‌మెన్ రోహిత్ శ‌ర్మ‌, కేఎల్ రాహుల్‌, విరాట్ కోహ్లీ, సూర్య‌కుమార్ యాద‌వ్‌, ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్న విష‌యం తెలిసిందే.

అయితే.. టీమిండియా బ్యాటింగ్ లైన‌ప్ ప‌టిష్టంగానే ఉన్నా.. బౌలింగ్ లో మాత్రం బ‌ల‌హీనంగా ఉంది. మొద‌ట్లో క‌ట్ట‌డి చేస్తున్నా.. డెత్ ఓవ‌ర్ల‌లో మాత్రం భారీగా పరుగులు ఇస్తున్నారు. ప్ర‌స్తుతం టీమిండియాను క‌ల‌వ‌ర‌పెడుతున్న విష‌యం ఇదే. బుమ్రా, చాహ‌ర్‌, జ‌డేజా లాంటి ప్లేయ‌ర్స్ ఉంటే డెత్ ఓవ‌ర్ల‌లో రాణించేవారు. గాయం కార‌ణంగా టోర్నీ నుంచి నిష్క్ర‌మించిన బుమ్రాకు బ‌దులు ష‌మీ, సిరాజ్‌, శార్దుల్ ఠాకూర్ లాంటి బౌల‌ర్ల‌ను బీసీసీఐ సెలెక్ట‌ర్లు ఆస్ట్రేలియా పంప‌నున్నారు. ఆస్ట్రేలియా పిచ్‌ల మీద పేసర్‌తోపాటు బ్యాటర్‌ను కూడా ఎంచుకుంటే రాణించే అవ‌కాశం ఉంద‌ని క్రికెట్ నిపుణులు చెప్తున్నారు. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ ఆస్ట్రేలియా వేద‌కగా ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. టీమిండియా త‌న మొద‌టి మ్యాచ్‌ను అక్టోబ‌ర్ 23న పాకిస్థాన్‌తో త‌ల‌ప‌డ‌నుంది.