భారత జట్టుకు మరోషాక్ తగిలింది. యువ పేసర్ దీపక్ చాహర్ గాయం కారణంగా టీ20 ప్రపంచకప్ టోర్నీ నుంచి వైదొలిగాడు. చాహర్ స్టాండ్ బై జాబితాలో ఉన్నాడు. జస్ ప్రీత్ బుమ్రా స్థానంలో చాహర్ ను తీసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ చాహర్ చీలమండకు గాయంతోపాటు వెన్ను నొప్పి కూడా రావడంతో ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు.
చాహర్ దూరం కావడంతో మహమ్మద్ షమీతోపాటు మహ్మద్ సిరాజ్, శార్ధూల్ ఠాకూర్ ఇవాళ ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు. కోవిడ్ బారిన పడ్డ షమీ ఇప్పుడు కోలుకున్నాడు. ఆస్ట్రేలియా వెళ్లే ముందు ncpలో ఫిట్ నెస్ టెస్టుకు హాజరవుతాడు. అందులో పాస్ అవుతే సిరాజ్, శార్దూల్ తోపాటు భారత జట్టులో కలుస్తాడు. ఆస్ట్రేలియా చేరుకోగానే ఈ ముగ్గురినీ పరీక్షించి బుమ్రాస్థానాన్ని భర్తీ చేయాలని భావిస్తోంది టీం మేనేజ్ మెంట్.
గురువారం పెర్త్‌లో ప్రాక్టీస్ గేమ్ తర్వాత.. భారత జట్టు బ్రిస్బేన్‌కు వెళుతుంది. అక్కడ అక్టోబర్ 17,19 తేదీల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో రెండు అధికారిక ICC T20 WC వార్మప్ మ్యాచ్‌లను ఆడతారు. దీని తరువాత, అక్టోబర్ 23న పాకిస్తాన్‌తో జరిగే బ్లాక్‌బస్టర్ క్లాష్‌లో తమ టోర్నమెంట్ ప్రచారాన్ని ప్రారంభించడానికి జట్టు మెల్‌బోర్న్‌కు వెళుతుంది. టోర్నమెంట్‌లో భారత గ్రూప్ 2లో భాగం, ఇందులో పాకిస్తాన్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఇద్దరు క్వాలిఫైయర్లు కూడా ఉన్నారు.
భారత టీ20 ప్రపంచకప్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (WK), దినేష్ కార్తీక్ (wk), హార్దిక్ పాండ్యా, R అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్.