Site icon HashtagU Telugu

T20 World Cup Semifinal: మరో ప్రతీకారానికి వేళాయే ఇంగ్లాండ్ తో సెమీస్ కు భారత్ రెడీ

T20 World Cup Semifinal

T20 World Cup Semifinal

T20 World Cup Semifinal: టీ ట్వంటీ ప్రపంచకప్ టైటిల్ కు రెండు అడుగుల దూరంలో ఉన్న టీమిండియా ఇంగ్లాండ్ తో సెమీఫైనల్ పోరుకు రెడీ అయింది. గయానా వేదికగా గురువారం రాత్రి జరగనున్న మ్యాచ్ లో ఇంగ్లీష్ టీమ్ పై రివేంజ్ కు సై అంటోంది. ఇప్పటికే 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమికి ఆసీస్ పై ప్రతీకారం తీర్చుకున్న రోహిత్ సేన తాజాగా ఇంగ్లాండ్ ను దెబ్బకొట్టాలని పట్టుదలగా ఉంది. గత టీ ట్వంటీ వరల్డ్ కప్ సెమీస్ లో ఇంగ్లాండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఘోరపరాభవాన్ని అభిమానులు మరిచిపోలేదు. ఇప్పుడు ఆ ఓటమికి రివేంజ్ తీర్చుకునే అవకాశం రావడంతో భారత జట్టుకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఈ మెగా టోర్నీలో కోహ్లీ , జడేజా వైఫల్యం తప్పిస్తే మిగిలినదంతా భారత్ కు ఫేవర్ గానే ఉంది.

ఓపెనర్ గా కోహ్లీ సక్సెస్ కాలేకపోయాడు. ఒక్క మ్యాచ్ లోనూ మెరుపులు మెరిపించలేకపోవడం ఫ్యాన్స్ ను నిరాశపరిచింది. మరి కీలకమైన సెమీస్ పోరులో విరాట పర్వాన్ని చూపిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. మిగిలిన బ్యాటింగ్ లో రోహిత్ శర్మ, రిషబ్ పంత్ , పాండ్యా, సూర్యకుమార్ టచ్ లోకి వచ్చారు. జడేజా ఒక్కటే ఆకట్టుకుకోలేకపోతున్నాడు. అతనిస్థానంలో సంజూ శాంసన్ ఆడిస్తారని వార్తలు వస్తున్నాయి. ఇక బౌలింగ్ లో భారత్ కు తిరుగులేదనే చెప్పాలి. పేస్ విభాగంలో బూమ్రా, అర్షదీప్ సింగ్ అదరగొట్టేస్తున్నారు. బూమ్రా అయితే ప్రత్యర్థి బ్యాటర్లకు తనదైన పేస్ తో చుక్కలు చూపిస్తున్నాడు. అటు అర్షదీప్ చక్కని స్వింగ్ బౌలింగ్ తో ఆకట్టుకుంటున్నాడు. ఇక స్పిన్నర్లుగా అక్షర్ పటేల్, కుల్దీప్ యాదన్ పై అంచనాలున్నాయి.

మరోవైపు ఇంగ్లాండ్ కూడా ఫామ్ లోనే ఉంది. గతంలో కంటే ఆ జట్టు మరింత బలంగా తయారైంది. ఎక్కువమంది ఆల్ రౌండర్లు ఉండడం ఇంగ్లీష్ టీమ్ కు అడ్వాంటేజ్ గా చెప్పాలి. బట్లర్ , ఫిల్ సాల్ట్ , బెయిర్ స్టో , బ్రూక్ బ్యాటింగ్ లో కీలకం. అటు బౌలింగ్ లో జోఫ్రా ఆర్చర్ , క్రిస్ జోర్డాన్ , శామ్ కరన్ ఫామ్ లో ఉండగా.. స్పిన్ విభాగంలో రషీద్, మొయిన్ అలీ ఇంగ్లాండ్ కు కీలకం కానున్నారు. ఇరు జట్లు బలాబలాల పరంగా సమఉజ్జీలుగా కనిపిస్తున్న నేపథ్యంలో హోరాహోరీ పోరు ఖచ్చితంగా అభిమానులను అలరించబోతోందని చెప్పొచ్చు.

Also Read: T20 World Cup Semi-Final : ఇంగ్లాండ్ తో సెమీఫైనల్.. ఆ ముగ్గురితోనే డేంజర్