T20 World Cup: టీమిండియాకు పట్టిన శని అంపైర్ మళ్లీ వచ్చేశాడు

అమెరికా, వెస్టిండీస్‌లో జరగనున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ తొలి రౌండ్‌కు 26 మంది మ్యాచ్ అధికారుల పేర్లను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. ఈ టోర్నీలో 20 జట్లు పాల్గొంటున్నాయి. 28 రోజులలో 9 వేర్వేరు ప్రదేశాల్లో టోర్నీని నిర్వహిస్తున్నారు. మొత్తం 55 మ్యాచ్‌లు జరగనున్నాయి.

T20 World Cup: అమెరికా, వెస్టిండీస్‌లో జరగనున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ తొలి రౌండ్‌కు 26 మంది మ్యాచ్ అధికారుల పేర్లను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. ఈ టోర్నీలో 20 జట్లు పాల్గొంటున్నాయి. 28 రోజులలో 9 వేర్వేరు ప్రదేశాల్లో టోర్నీని నిర్వహిస్తున్నారు. మొత్తం 55 మ్యాచ్‌లు జరగనున్నాయి.

టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లకు 20 మంది అంపైర్లు మరియు 6 మంది మ్యాచ్ రిఫరీలను ఐసీసీ ప్రకటించింది. తాజాగా ప్రకటించిన అంపైర్ల బృందంలో గతేడాది ఐసీసీ అంపైర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ పొందిన రిచర్డ్ ఇల్లింగ్వర్త్ స‌హా 2022 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ ఫైనల్లో అంపైర్లుగా వ్యవహరించిన కుమార్ ధర్మసేన, క్రిస్ గఫానీ, పాల్ రీఫిల్ ఉన్నారు.మొత్తం టోర్నీఅంపైర్లను చూస్తే క్రిస్ బ్రౌన్, కుమార్ ధర్మసేన, క్రిస్ గాఫ్నీ, మైఖేల్ గోఫ్, అడ్రియన్ హోల్డ్‌స్టాక్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, అల్లావుద్దీన్ పాలేకర్, రిచర్డ్ కెటిల్‌బరో, జయరామన్ మదగోపాల్, నితిన్ మీనన్, సామ్ నొగాస్కీ, అహ్సన్ రజా, రషీద్ రియాజ్, పాల్ రీఫెల్, షాహిద్ ససికారే రోడ్నీ టక్కర్. , అలెక్స్ వార్ఫ్, జోయెల్ విల్సన్ మరియు ఆసిఫ్ యాకోబ్ ఉన్నారు. వీళ్ళలో జయరామన్ మదగోపాల్, సామ్ నోగాజ్‌స్కీ, అల్లావుద్దీన్ పాలేకర్, రషీద్ రియాజ్ మరియు ఆసిఫ్ యాకూబ్‌లు మొదటిసారిగా సీనియర్ పురుషుల ప్రపంచ కప్‌లో అంపైరింగ్‌గా అరంగేట్రం చేయనున్నారు.

We’re now on WhatsAppClick to Join

మరోవైపు మ్యాచ్ రిఫరీలుగా డేవిడ్ బూన్, జెఫ్ క్రోవ్, రంజన్ మడుగల్లె, ఆండ్రూ పైక్రాఫ్ట్, రిచీ రిచర్డ్‌సన్, జావగల్ శ్రీనాథ్ ఎంపికయ్యారు. కాగా జట్టులో అనుభవజ్ఞులైన ఎంపైర్లు, మ్యాచ్ రెఫరీలు ఉన్నప్పటికీ టీమిండియాను ఓ విషయంలో క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తుంది. ప్రముఖ ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో ఉండటమే దీనికి కారణం. ఎందుకంటే తొమ్మిదేళ్లుగా ఐసీసీ ఈవెంట్లలో భార‌త జ‌ట్టు ఆడిన అన్నీ నాకౌట్ మ్యాచుల‌కు కెటిల్‌బరో ఫీల్డ్ అంపైర్ గా ఉన్నాడు. దురదృష్టవశాత్తు టీమిండియా అన్నింట్లోనూ ప‌రాజ‌యం పాలైంది. అలాంటి అంపైర్ మళ్లీ ఇప్పుడు టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో అంపైర్ గా వ్యవహరించనుండ‌డంతో భార‌త అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

Also Read: Petrol Bikes: అధిక మైలేజీ ఇస్తున్న బైక్‌లు ఇవే.. ధ‌ర కూడా త‌క్కువే..!