T20 World Cup: నేడు భార‌త్‌- పాకిస్థాన్ మ్యాచ్‌.. పాక్ జ‌ట్టులోకి కీలక ఆట‌గాడు, గెలుపెవ‌రిదో..?

  • Written By:
  • Updated On - June 9, 2024 / 08:33 AM IST

T20 World Cup: టీ20 ప్రపంచకప్ (2024 T20 World Cup)లో 19వ మ్యాచ్ ఆదివారం భారత్, పాకిస్థాన్ మధ్య జరగనుంది. క్రికెట్ ప్రేమికులు చాలా కాలంగా ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆ సమయం వచ్చింది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఉదయం 10.30 గంటలకు భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ స్టార్ ఆల్ రౌండర్ ఇమాద్ వసీమ్ ఫిట్‌గా మారాడు.

ఇమాద్ టీమిండియాకు ఇబ్బందులు సృష్టిస్తాడా..?

అన్నింటిలో మొదటిది పాకిస్తాన్ తన మొదటి మ్యాచ్‌ని అమెరికాతో ఆడింది. అందులో పాక్ జ‌ట్టు.. సూపర్ ఓవర్‌లో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చిన మ‌న‌కు తెలిసిందే. అయితే గాయం కారణంగా ఇమాద్ వసీమ్ అమెరికాతో జరిగిన మ్యాచ్ లో ఆడలేకపోయాడు. ఇప్పుడు ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఇమాద్ స్పిన్ ఆల్ రౌండర్.. కాబట్టి అతను న్యూయార్క్ పిచ్‌లో భారత బ్యాట్స్‌మెన్‌లను పెద్దగా ఇబ్బంది పెట్టలేడని క్రీడా పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ పిచ్‌పై అక్కడ ఫాస్ట్ బౌలర్లకు సహాయం ఉంది. అయితే ఇమాద్ పునరాగమనం కచ్చితంగా పాక్ జట్టులో జోష్ నింపుతోంది.

Also Read: Rohit Sharma: టీమిండియా అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. పాక్‌తో మ్యాచ్‌కు రోహిత్ సిద్ధం..!

ఆజం ఖాన్ స్థానంలో ఇమాద్ వసీమ్‌ను పాక్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చవచ్చు. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అజం ఖాన్ ఖాతా తెర‌వ‌కుండానే ఔటయ్యాడు. దీంతో ఆజం ఖాన్ స్థానంలో ఇమాద్‌ను బ‌రిలోకి దింపే అవ‌కాశం ఉంది.

ఇమాద్ 70 వికెట్లు తీశాడు

ఇమాద్ వసీమ్‌ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్. 72 టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో 70 వికెట్లు పడగొట్టాడు. కాగా బ్యాటింగ్‌తో 535 పరుగులు చేశాడు. ఇటీవ‌ల‌ ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 4 ఓవర్లలో 19 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో అతను ఎనిమిదో స్థానంలో వచ్చాడు. 13 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 22 పరుగులు చేశాడు. ఆ త‌ర్వాత నుంచి అతను ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. ఇమాద్ రాక జట్టుకు బలం చేకూరుతుందని పాకిస్థాన్ భావిస్తోంది. ఈ ఆల్‌రౌండర్ హై ప్రెజర్ మ్యాచ్‌లలో ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

We’re now on WhatsApp : Click to Join

టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభానికి ముందు ఇమాద్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్ కావడం గమనార్హం. టీ20 ప్రపంచకప్‌ కోసం ఇమాద్‌ తన రిటైర్‌మెంట్‌ను ఉపసంహరించుకున్నాడు. అయితే అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌కు అతను దూరమయ్యాడు. ప్రపంచకప్‌కు ముందు ఇమాద్.. న్యూజిలాండ్, ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో టీ20 సిరీస్‌లు ఆడాడు.