T20 World Cup: సూపర్-8 మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడేటప్పుడు భారత్ చాలా జాగ్రత్తగా ఉండాలని అఫ్గానిస్థాన్ మాజీ బ్యాటింగ్ కోచ్ ఉమేష్ పట్వాల్ హెచ్చరించాడు. గురువారం బార్బడోస్‌లో భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరగనుంది. పురుషుల టీ20లో భారత్ ఎనిమిదిసార్లు ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడింది. అయితే ఈ ఫార్మాట్‌లో భారత్ ఒక్కసారి కూడా ఓడిపోలేదు. అయినప్పటికీ రోహిత్ సేన జాగ్రత్తగా ఉండాలని ఉమేష్ పట్వాల్ హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. మరి ఉమేష్ పట్వాల్ అలా ఎందుకు అన్నాడో చూద్దాం.
ఈ ఏడాది బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో చివరిసారి తలపడిన భారత్, ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ 212-212 పరుగులతో డ్రాగా ముగిసింది. ఆ తర్వాత రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా గెలవాలంటే రెండు సూపర్ ఓవర్లు ఆడాల్సి వచ్చింది. ఇక తాజాగా ఉమేష్ పట్వాల్ మాట్లాడుతూ.. గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో పాటు బలమైన జట్లను ఓడించి ఆఫ్ఘనిస్థాన్ తమ ఫామ్ ను ప్రూవ్ చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈసారి ఆఫ్ఘనిస్థాన్‌ను ఎదుర్కొనేందుకు భారత్ పటిష్ట వ్యూహాన్ని రచించాల్సి ఉంటుంది. సూపర్-8 వచ్చిన ఆఫ్ఘన్ కప్ కొట్టే అవకాశాన్ని వదులుకోదని నేను ఆశిస్తున్నాను అని ఆయన చెప్పారు.
ఉమేష్ పట్వాల్ మాట్లాడుతూ.. గత ఏడాది వన్డే ప్రపంచకప్‌లో ఓ మ్యాచ్‌లో గ్లెన్ మాక్స్‌వెల్ డబుల్ సెంచరీ చేయడం ద్వారా ఆఫ్ఘనిస్తాన్‌ను టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది. కాబట్టి ఈ ప్రపంచకప్ లో ఆఫ్ఘన్ రాణించడానికి ఎంతటి కఠిన పరిస్థితుల్ని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటుందని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ మెగాటోర్నీలో గెలుపు ఓటములు పక్కనపెడితే ఆఫ్ఘన్ మొదటి నాలుగు స్థానాల్లో ఉంటుందని ఉమేష్ తెలిపారు.
Also Read: Priyanka Chopra : ప్రమాదానికి గురైన ప్రియాంక చోప్రా