T20 World Cup: పాకిస్థాన్‌కి భారత్ తొలి పంచ్..

టి20 ప్రపంచ కప్ లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు రాణించలేకపోయారు . ఈ మ్యాచ్‌లో బాబర్ అజామ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 20 ఓవర్లు మొత్తం బ్యాటింగ్ చేయలేక 119 స్కోరుకే పరిమితమైంది

T20 World Cup: టి20 ప్రపంచ కప్ లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు రాణించలేకపోయారు . ఈ మ్యాచ్‌లో బాబర్ అజామ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 20 ఓవర్లు మొత్తం బ్యాటింగ్ చేయలేక 119 స్కోరుకే పరిమితమైంది. టార్గెట్ చిన్నదే అయినప్పటికీ న్యూయార్క్ పిచ్‌పై భారత బౌలర్లు దానిని కాపాడతారు అనిపించింది.

న్యూయార్క్‌లోని నసావు క్రికెట్ స్టేడియంలో వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో భారత జట్టుకు శుభారంభం లభించలేదు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన టీమ్ ఇండియాకు శుభారంభం లభించలేదు. రెండో ఓవర్లోనే విరాట్ కోహ్లి అవుట్ కాగా, ఆ తర్వాతి ఓవర్లోనే రోహిత్ శర్మ ఔట్ అయ్యి పెవిలియన్ బాట పట్టాడు. 3 బంతుల్లో 4 పరుగులు చేసి కోహ్లీ వికెట్ కోల్పోగా, రోహిత్ శర్మ 12 బంతుల్లో 13 పరుగులు చేశాడు. ఈ సమయంలో రిషబ్ పంత్ మరియు అక్షర్ పటేల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దడానికి ప్రయత్నించారు, అయితే నసీమ్ షా 20(18) స్కోరు వద్ద అక్షర్ ను అవుట్ చేయడం ద్వారా భారత్‌కు మూడో దెబ్బ తగిలింది. ఆ తర్వాత బ్యాట్స్‌మెన్‌స్ వచ్చి వెళ్లిపోయారు. సూర్యకుమార్ యాదవ్ 7, శివమ్ దూబే 3, హార్దిక్ పాండ్యా 7, రవీంద్ర జడేజా 0, అర్ష్‌దీప్ సింగ్ 9, మహ్మద్ సిరాజ్ 7 పరుగుల వద్ద ఔటయ్యారు. రిషబ్ పంత్ భారత్ తరఫున అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడాడు. 31 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 42 పరుగులు చేశాడు. దీంతో రోహిత్ సేన 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది.

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ బ్యాటర్లు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం రాలేదు. బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్ ఓపెనర్లుగా వచ్చారు. అర్ష్‌దీప్ సింగ్ తొలి ఓవర్‌లో 9 పరుగులు ఇచ్చాడు. 3 ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్ స్కోరు వికెట్ లేకుండా 19 పరుగులు సాధించింది. అయితే పాకిస్థాన్‌కు జస్ప్రీత్ బుమ్రా రూపంలో తొలి దెబ్బ తగిలింది. బుమ్రా బాబర్ అజమ్‌ను అవుట్ చేశాడు. బాబర్ 10 బంతుల్లో 13 పరుగులు చేసి ఔటయ్యాడు. 7 ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్ స్కోరు 38/1. మహ్మద్ సిరాజ్ వేసిన ఈ ఓవర్లో కేవలం మూడు పరుగులు మాత్రమే వచ్చాయి. 57 పరుగుల వద్ద పాకిస్థాన్‌కు రెండో దెబ్బ తగిలింది. అక్షర్ పటేల్ ఉస్మాన్ ఖాన్‌ను సాగనంపాడు. ఉస్మాన్ ఖాన్ 15 బంతుల్లో 13 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా దెబ్బకు పాక్ ఐదో వికెట్ కోల్పోయింది . షాదాబ్ ఖాన్‌ను పంత్ క్యాచ్ అవుట్ చేశాడు. షాదాబ్ 7 బంతుల్లో 4 పరుగులు చేశాడు. అయితే ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్ చివరిలో పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఫలితంగా పాకిస్థాన్ భారత్ చేతిలో ఓటమి పాలైంది. పాక్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 113 పరుగులకే చాపచుట్టేసింది.

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ మరియు అర్ష్‌దీప్ సింగ్.

పాకిస్థాన్: బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇమాద్ వసీం, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, మహ్మద్ అమీర్, హరీస్ రవూఫ్.

Also Read: T20 World Cup: పాకిస్థాన్‌కి భారత్ తొలి పంచ్..