Site icon HashtagU Telugu

T20 World Cup Terror Threat: టీ20 వ‌రల్డ్ క‌ప్‌కు ఉగ్ర‌దాడి ముప్పు..?

2024 T20 World Cup

2024 T20 World Cup

T20 World Cup Terror Threat: T20 ప్రపంచ కప్ 2024 ప్రారంభం కావడానికి ఒక నెల కంటే తక్కువ సమయం ఉంది. ఇదిలా ఉంటే టోర్నీకి ఉగ్రదాడి ముప్పు (T20 World Cup Terror Threat) పొంచి ఉందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అమెరికా, వెస్టిండీస్‌ వేదికగా జూన్‌ 1 నుంచి జూన్‌ 29 మధ్య టీ20 వరల్డ్‌ మ్యాచ్‌ జరగనుంది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. టోర్నమెంట్ సందర్భంగా కరేబియన్ దేశాలలో ఉగ్రవాద దాడుల బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపుల‌కు పాకిస్థాన్‌తో సంబంధాలున్నాయని చెబుతున్నారు.

ఉగ్రవాదుల దాడి ముప్పును దృష్టిలో ఉంచుకుని కరేబియన్ దేశం ట్రినిడాడ్ అండ్ టొబాగో భద్రతా హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచ కప్‌కు ముప్పును ఎదుర్కోవడానికి CARICOM (కరేబియన్ దేశాల సమూహం), భద్రతా సంస్థలు పనిచేస్తున్నాయని ప్రధాన మంత్రి కీత్ రౌలీ చెప్పారు. అయితే ఈ ICC ఈవెంట్‌లో వచ్చే ముప్పును బార్బడోస్ ప్రాంతీయ భద్రతా అధికారి పర్యవేక్షిస్తున్నట్లు ‘ట్రినిడాడ్ ఎక్స్‌ప్రెస్’ నివేదించింది.

Also Read: MI vs SRH: నేడు ముంబై వ‌ర్సెస్ హైద‌రాబాద్‌.. మ‌రో హైస్కోరింగ్ మ్యాచ్ అవుతుందా..?

“ప్రో-ఇస్లామిక్ స్టేట్ (IS) మీడియా మూలాలు క్రీడా కార్యక్రమాలపై హింసను ప్రేరేపించే ప్రచారాలను ప్రారంభించాయి. IS ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ శాఖ (ISKhoran) ఒక వీడియో సందేశాన్ని కూడా విడుదల చేసింది,” అని భద్రతా హెచ్చరిక జారీ చేయబడింది. ఇది కాకుండా అనేక దేశాల్లో రక్తపాతం, వారు నివసిస్తున్న దేశంపై దాడి చేయడానికి తన మద్దతుదారులకు విజ్ఞప్తి చేశారు. ఐఎస్‌కి చెందిన మీడియా గ్రూప్ “నాషీర్ పాకిస్థాన్” ద్వారా ప్రపంచకప్‌కు ముప్పు పొంచి ఉందని కరేబియన్ మీడియాలో సమాచారం అందింది. ట్రినిడాడ్ ఎక్స్‌ప్రెస్ ప్రకారం.. నషీర్-ఎ-పాకిస్థాన్ అనేది ISకి సంబంధించిన ప్రచార ఛానెల్.

We’re now on WhatsApp : Click to Join

అమెరికాలో జరిగే మ్యాచ్‌లకు ఎలాంటి ముప్పు లేదు

ప్రపంచ కప్ మ్యాచ్‌లు అమెరికాలోని మూడు నగరాల్లో జరుగుతాయి. ఫ్లోరిడా, టెక్సాస్, న్యూయార్క్. నివేదికల ప్రకారం.. అమెరికాలో జరుగుతున్న మ్యాచ్‌లపై దాడి చేసే ప్రమాదం లేదు. టీమ్ ఇండియా తన గ్రూప్ మ్యాచ్‌లన్నీ అమెరికాలో మాత్రమే ఆడుతుంది. జూన్ 9న న్యూయార్క్‌లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య హై ఓల్టేజీ మ్యాచ్ జరగనుంది.

ఈ విషయాన్ని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తెలిపింది

ప్రపంచకప్‌పై ఉగ్రదాడి నేపథ్యంలో భద్రతపై ఆందోళనలు నెలకొన్నాయి. అయితే వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సీఈఓ జానీ గ్రేవ్ ఎలాంటి ప్రమాదాన్ని తగ్గించేందుకు బలమైన భద్రతా ప్రణాళికను కలిగి ఉన్నామని హామీ ఇచ్చారు. జానీ గ్రేవ్స్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. మేము ఆతిథ్య దేశాలు, నగరాల అధికారులతో కలిసి పని చేస్తాము. మా ఈవెంట్‌లకు ఏవైనా ప్రమాదాలను తగ్గించడానికి తగిన ప్రణాళిక రూపొందించబడిందని నిర్ధారించుకోవడానికి మేము టోర్నీ ఈవెంట్‌లను నిరంతరం పర్యవేక్షిస్తాము. ICC పురుషుల T20 ప్రపంచ కప్‌లో ప్రతి ఒక్కరి భద్రతే మా ప్రథమ ప్రాధాన్యత అని మేము వాటాదారులందరికీ హామీ ఇస్తున్నాము. మాకు సమగ్రమైన, బలమైన భద్రతా ప్రణాళిక ఉందని తెలిపారు.