Site icon HashtagU Telugu

T20 World Cup Opening Ceremony: టీ20 ప్రారంభ వేడుక‌ల్లో ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇవ్వ‌నున్న తార‌లు వీరే..!

2024 T20 World Cup

2024 T20 World Cup

T20 World Cup Opening Ceremony: టీ20 ప్రపంచకప్ 2024 జూన్ 2 నుంచి ప్రారంభం కానుంది. తొలిరోజు 2 మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో కెనడాతో అమెరికా, రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్.. పపువా న్యూగినియాతో తలపడనున్నాయి. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించనున్న ఈ టోర్నీలో 20 జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. అన్ని జట్లను 5 చొప్పున 4 గ్రూపులుగా విభజించారు. టోర్నీ ప్రారంభానికి ముందు ఓపెనింగ్ వేడుక ఉంటుంది. ఈ ప్రారంభ వేడుక‌ (T20 World Cup Opening Ceremony)లో చాలా మంది తారలు ప్రదర్శనలు ఇవ్వ‌నున్నారు.

ఈ తారలు ప్రదర్శన ఇవ్వనున్నారు

T20 ప్రపంచ కప్ 2024 ప్రారంభ వేడుక టెక్సాస్‌లోని గ్రాండ్ ప్రైరీ స్టేడియంలో జరగనుంది. భారతదేశంలో ప్రారంభ వేడుకల ప్రత్యక్ష ప్రసారం స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ఉంటుంది. ఇది కాకుండా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు. ట్రినిడాడియన్ గాయకులు డేవిడ్ రడ్డర్, రవి బి, స్వరకర్త, గీత రచయిత ఇర్ఫాన్ అల్వెస్, గాయకుడు DJ అనా, అల్ట్రా సిమ్మో ప్రారంభ వేడుకలో ప్రదర్శన ఇవ్వనున్నారు.

Also Read: Smoking: స్మోకింగ్ చేస్తున్నారా.. అయితే ఈ విషయం మీకు తెలుసా

ఈ జట్ల మధ్య మ్యాచ్‌లు

టీ20 ప్రపంచకప్‌లో 20 జట్లు పాల్గొంటున్నాయి. వీటిలో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, కెనడా, ఇంగ్లాండ్, ఇండియా, ఐర్లాండ్, నమీబియా, నేపాల్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, ఒమన్, పాకిస్థాన్, పాపువా న్యూ గినియా, స్కాట్లాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఉగాండా, USA, వెస్టిండీస్ ఉన్నాయి.

అయితే టీమిండియా మ్యాచ్‌లు మాత్రం జూన్ 5 నుంచి ప్రారంభంకానున్నాయి. జూన్ 5న ఐర్లాండ్‌తో త‌ల‌ప‌డ‌నున్న భార‌త ఆ త‌ర్వాత జూన్ 9వ తేదీన పాకిస్థాన్ త‌ల‌ప‌డ‌నుంది. ఈసారి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గెలుపే ల‌క్ష్యంగా టీమిండియా బ‌రిలోకి దిగుతోంది.

We’re now on WhatsApp : Click to Join

20 జట్ల మధ్య పోరు జరుగుతుంది