Zimbabwe Players Salary : జింబాబ్వే క్రికెటర్ల పరిస్థితి దారుణం…వారికి చెల్లించే జీతం ఎంతో తెలుసా..?

  • Written By:
  • Publish Date - October 30, 2022 / 12:07 PM IST

T20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ దారుణంగా ఓడించిన పసికూన జింబాబ్వే తీరు ప్రపంచ క్రీడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఎంతో పట్టుదలతో సడలని ఆత్మవిశ్వాసంతో ఆడుతూ విజయాన్ని దక్కించుకున్నారు. ఒక్కపరుగుతో పాకిస్తాన్ను ఓడించి సంచలనం సృష్టించింది. బలహీనుడిని ఎప్పుడు తక్కువగా అంచనా వేయకూడదని నిరూపించింది. జింబాబ్వేను తేలికగా తీసుకోవదంటూ ఏ జట్టుకైనా ఇలాంటి దిమ్మతిరిగే షాక్ తప్పదని స్పష్టం చేసింది. కానీ ఎంతో అద్బుతమైన ఆటతీరు కనబరిచే జింబాబ్వే ఆటగాళ్ల పరిస్థితి మాత్రం అంత ప్రత్యేకంగా లేదు. ఆస్ట్రేలియా, ఇండియా, పాకిస్తాన్ వంటి దేశాల ఆటగాళ్ల కంటే తక్కువ జీతం పొందుతున్నారు.

స్టాండర్డ్ రిపోర్టు ప్రకారం…జింబాబ్వే ఆటగాళ్లను నాలుగు గ్రేడ్ లుగా X, A,B,Cలుగా విభజించారు. గ్రేడ్ ఎక్స్ ఆటగాళ్లు ప్రతినెలా 5వేల యూఎస్ డాలర్లు ( దాదాపు 4.11లక్షలరూపాయలు) పొందుతారు. గ్రేడ్ ఏ ఆటగాళ్లు వారికి నెలలో 3500యూఎస్ డాలర్లు ( సుమారు రూ. 2.80లక్షలు) చెల్లిస్తారు. గ్రేడ్ బి ఆటగాళ్లకు నెలకు రెండు వేల డాలర్లు (రూ. 1.64లక్షలు), గ్రేడ్ సి ఆటగాళ్లకు నెల 1500యూఎస్ డాలర్లు (1.23లక్షలు ) వేతనంగా పొందుతారు.

టెస్ట్ మ్యాచ్ ఆడినందుకు రెండు వేల డాలర్లు (రూ. 1.64లక్షలు) వన్డేలకు వెయ్యి డాలర్లు ( సుమారు 82వేల రూపాయలు) , టీ20 ఇంటర్నేషనల్ కు 500డాలర్లు ( 41వేల రూపాయలు) చెల్లిస్తారు. జింబాబ్వే నేషనల్ ప్రీమియర్ లీగ్ లో గెలిచిన జట్టుకు రూ. 8.50లక్షలు. అంటే IPLవేలంలో ఆటగాడి కనీస బేస్ ధర రూ. 20లక్షల కంటే చాలా తక్కువ ఇది. కానీ ఒకప్పుడు జింబాబ్వే క్రికెట్ మంచి స్థాయిలో ఉండేది. ఆండీ, గ్రాంట్, ముర్రే, గుడ్విన్, పాల్ స్ట్రాంగ్, హీత్ స్ట్రీక్ క్రికెట్ నుంచి నిష్క్రమించడంతో క్రికెట్ కు ఆధారణ గణనీయంగా తగ్గిపోయింది. అంతేకాదు చాలా సందర్భాల్లో తక్కువ జీతం ఉందంటూ ఆటను బహిష్కరించారు. దీంతో జింబాబ్వే క్రికెట్ బోర్డులో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టింది. దీని కారణంగా ఐసీసీ జులై 2019లో జింబాబ్వేను అంతర్జాతీయ క్రికెట్ నుంచి 6నెలలపాటు సస్పెండ్ చేసింది. ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ఫ్రంట్ లో పరిస్థితి మెరుగుపడటంతో…ఆటగాళ్లకు, కోచ్ లకు ఐసీసీ నుంచి చెల్లిస్తున్నారు.

భారత జట్టు కోసం BCCI సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా:
కేటగిరీ A+ (రూ. 7 కోట్లు)
కేటగిరీ A (రూ. 5 కోట్లు)
కేటగిరీ బి (రూ. 3 కోట్లు)
కేటగిరీ సి (రూ. 1 కోటి.)

భారత ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజు ఎంత?
ఒక టెస్టు మ్యాచ్: రూ. 15 లక్షలు
ఒక వన్డే మ్యాచ్: రూ. 6 లక్షలు
ఒక టీ20 మ్యాచ్: రూ. 3 లక్షలు

భారత ఆటగాళ్ల మ్యాచ్ ఫీజు చాలా రెట్లు ఎక్కువ
భారత ఆటగాళ్లు టెస్టు క్రికెట్‌లో ఒక మ్యాచ్‌కు 15 లక్షల రూపాయలు అందుకుంటారు. వన్డే ఇంటర్నేషనల్‌లో పురుషులకు ఒక మ్యాచ్‌కు 6 లక్షల రూపాయలు ఇస్తారు. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక మ్యాచ్ ఆడేందుకు 3 లక్షల రూపాయలు తీసుకుంటారు.