ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022 తుదిపోరుకు చేరుకుంది. సెమీ ఫైనల్స్ కు నాలుగు జట్లు చేరుకున్నాయి. గ్రూప్ 1 లో న్యూజిలాండ్, ఇంగ్లండ్ ఉన్నాయి. గ్రూప్ 2 లో ఇండియా పాకిస్తాన్ ఉన్నాయి. నవంబర్ 9న మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లుగా తలపడే అవకాశం ఉంది. అద్బుతమైన ఆటతీరు కనబరిచిన న్యూజిలాండ్…పాకిస్తాన్ తో పోటీ పడనుంది. పాకిస్తాన్ అదృష్టం కలిసి వచ్చి సెమీస్ కు చేరుకుంది.
న్యూజిలాండ్ బ్యాటింగ్ లో దుమ్ము రేపుతోంది. పాకిస్తాన్ బౌలింగ్ బలంగా ఉంది. దీంతో ఈ కీలక మ్యాచ్ బౌలింగ్ వర్సెస్ బ్యాటింగ్ అన్నట్లు సాగనుంది. చివరి నిమిషంలో మెగా టోర్నీలోకి దూసుకొచ్చిన పాకిస్తాన్ ఈసారి తన సత్తా చాటాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. కీవీస్ కు షాకింగ్ ఇచ్చేందుకు పాక్ ప్లాన్ చేస్తోంది. కాగా కీవీస్ కెప్టెన్ విలియమ్స్ తో పాటు అలెన్ , కాన్వే లో ఫాంలో ఉన్నారు. ఇది ఆ జట్టుకు కలిసివచ్చే అంశం. బౌలింగ్ లో బౌల్ట్, సోదీ కీలకం. పాకిస్తాన్ జట్టలో బాబర్, రిజ్వాన్, షాన్ మసూద్, ఇప్తికార్, నవాజ్ వీరు కీలకం. వీరు మంచి ఆటతీరు కనబర్చితే విజయం వారి ఖాతాలో పడినట్లు. బౌలింగ్ లో ఆఫ్రిది, నసీమ్ , వసీం తమ బలాన్ని నిరూపించుకునేందుకు రెడీ అవుతున్నారు.