Rahul Dravid: ద్రావిడ్ కు ఫేర్ వెల్ గిఫ్ట్ ఇస్తారా..? కోచ్ గా ది వాల్ కు చివరి ఛాన్స్!

  • Written By:
  • Updated On - June 28, 2024 / 04:35 PM IST

Rahul Dravid: వరల్డ్ క్రికెట్ లో టీమిండియా ఐసీసీ టైటిల్ గెలిచి 13 ఏళ్ళు దాటిపోయింది. 2014 టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ చేరినా ఓడిపోయింది. ఇక గత ఏడాది సొంతగడ్డపై వన్డే వరల్డ్ కప్ ఫైనల్లోనూ నిరాశే మిగిలింది. ఇప్పుడు టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచేందుకు అడుగుదూరంలో ఉన్న భారత్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కు గ్రాండ్ ఫేర్ వెల్ ఇవ్వాలని భావిస్తోంది. కోచ్ గా ద్రావిడ్ (Rahul Dravid) కు ఈ మెగా టోర్నీనే చివరిది. 2021లో భారత జట్టు కోచ్ గా బాధ్యతలు అందుకున్న ద్రావిడ్ ఆధ్వర్యంలో మన జట్టు నిలకడగానే రాణించినా ఐసీసీ టోర్నీలో మాత్రం విజేతగా నిలవలేకపోయింది. అయితే టెస్టులు, వన్డేలతో పాటు ద్వైపాక్షిక సిరీస్ లలో సత్తా చాటింది.

టెస్టుల్లో 6, వన్డేల్లో 10 , టీ ట్వంటీల్లో 14 సిరీస్ లు గెలిచింది. 2021 టీ ట్వంటీ వరల్డ్ కప్ లో సెమీస్ చేరలేకపోయిన భారత్ 2022 లో గ్రూప్ స్టేజ్ లోనే ఇంటిదారి పట్టింది. 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరినా రన్నరప్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అదే ఏడాది జరిగిన ఆసియాకప్ గెలవడం కోచ్ గా ద్రావిడ్ ఖాతాలో తొలి టైటిల్. ఇక 2023 వన్డే ప్రపంచకప్ లో తిరుగులేని విజయాలతో ఫైనల్ చేరిన భారత్ టైటిల్ వేటలో చతికిలపడింది. ఆసీస్ చేతిలో పరాజయం పాలై రన్నరప్ గా నిలిచింది.

Also Read: Pawan Kalyan : రేపే పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన.. షెడ్యూల్ ఇదే..

ఇప్పుడు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ చేరడంతో కోచ్ గా కెరీర్ ను గ్రాండ్ గా ముగించేందుకు మంచి అవకాశమని చెప్పొచ్చు. ద్రావిడ్ కోసం టైటిల్ గెలుస్తామని భారత క్రికెటర్లు కూడా ధీమాగా చెబుతున్నారు. మరి తుది పోరులో సౌతాఫ్రికాను ఢీకొట్టనున్న టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తూ వరల్డ్ కప్ గెలిచి ద్రావిడ్ కు ఘనంగా వీడ్కోలు పలుకుతుందేమో చూడాలి.

We’re now on WhatsApp : Click to Join