IND vs WI: జింబాబ్వేపై విజయం సాధించడం ద్వారా టీమ్ ఇండియా సెమీఫైనల్స్‌కు చేరుకునే అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. సెమీఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకోవాలంటే వెస్టిండీస్‌తో జరగబోయే తదుపరి మ్యాచ్‌లో భారత్ తప్పక విజయం సాధించాలి. రెండు జట్లకు ఈ మ్యాచ్ క్వార్టర్ ఫైనల్ లాంటిది. ఓడిపోయిన జట్టు నేరుగా సెమీస్ రేసు నుండి నిష్క్రమిస్తుంది. ఈ కీలక పోరును అభిమానులు ఎక్కడ ఉచితంగా చూడవచ్చు? మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది? వంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
భారత్ vs వెస్టిండీస్ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ?
టీమ్ ఇండియా, వెస్టిండీస్ మధ్య జరగబోయే ఈ అత్యంత కీలకమైన మ్యాచ్ మార్చి 1న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరగనుంది. సెమీఫైనల్ బెర్త్ ఖరారు కావాలంటే ఈ మ్యాచ్‌లో గెలుపు తప్పనిసరి కావడంతో అందరి దృష్టి ఈ పోరుపైనే ఉంది.
Also Read: హీరో విజయ్‌కు ఎఫైర్.. విడాకులు కోరిన భార్య!?
మ్యాచ్‌ను ఉచితంగా ఎక్కడ చూడవచ్చు?
భారత్- వెస్టిండీస్ మధ్య జరిగే మ్యాచ్ ప్రసార హక్కులు స్టార్ నెట్‌వర్క్ వద్ద ఉన్నాయి.
టీవీలో: అభిమానులు ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ ఛానెళ్లలో చూడవచ్చు.
డిజిటల్/మొబైల్: మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లో చూడాలనుకునే వారు జియో హాట్‌స్టార్ యాప్‌లో సబ్‌స్క్రిప్షన్ ద్వారా చూడవచ్చు.
ఉచితంగా: ఈ మ్యాచ్ డీడీ ఫ్రీ డిష్‌లోని డీడీ స్పోర్ట్స్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. దీనిని వీక్షించడానికి మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.
టీ20ల్లో భారత్ vs వెస్టిండీస్ హెడ్-టు-హెడ్ రికార్డు
టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో భారత్ పైచేయి సాధించింది. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 30 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 19 సార్లు విజయం సాధించగా, వెస్టిండీస్ 10 సార్లు గెలిచింది (ఒకటి ఫలితం తేలలేదు). టీ20 ప్రపంచకప్‌లో గణాంకాలు కొంచెం భిన్నంగా ఉన్నాయి. ఇప్పటివరకు జరిగిన 4 మ్యాచ్‌ల్లో వెస్టిండీస్ 3 సార్లు విజయం సాధించగా, టీమ్ ఇండియా ఒక్కసారి మాత్రమే గెలిచింది.
