ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022 నుంచి నమీబియా నిష్క్రమించింది. గురువారం గీలాంగ్ లో జరిగిన మ్యాజ్ లో యూఏఈ ఏడు పరుగుల తేడాతో నమీబియాను ఓడించింది. ఈ మ్యాచ్ లో నమీబియా గెలిస్తే..సూపర్ 12లోకి వెళ్లేది. కానీ ఇప్పుడా కల నెరవేరలేదు. నమీబియా గ్రూప్ నుంచి శ్రీలంక, నెదర్లాండ్ సూపర్ 12వెళ్లే ఛాన్స్ దక్కించుకున్నాయి.
టోర్ని నుంచి నిష్క్రమించి నిరాశ నమీబియా ఆటగాళ్ల ముఖాల్లో స్పష్టంగా కనిపించింది. ఆల్ రౌండర్ డేవిడ్ వైస్ తన భవోద్వేగాలను అదుపుచేసుకోలేకపోయాడు. వెక్కి వెక్కి ఏడ్చాడు. వీసీ హాఫ్ సెంచరీ ఆడడం ద్వారా నమీబియా ఆశలను సజీవంగా ఉంచాడు. అయితే చివరి ఓవర్ లో తిరిగి పెవిలియన్ కు చేరాడు. ఆ తర్వాత జట్టు ఓడిపోయింది.
This is truly heartbreaking pictures – David Wiese gave his absolute best.
You played like a champ, Wiese!! ♥️ pic.twitter.com/orlY2pgEvf
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 20, 2022
అంతకుముందు డేవిస్ వైస్ దక్షిణాఫ్రికా జట్టు తరపున ఆడాడు. 37ఏళ్ల వైస్ 201లో దక్షిణాఫ్రికా తరపున టీ20లోకి అరంగేట్రం చేసి 20 మ్యాచుల్లో 24వికెట్లు పడగొట్టాడు. తర్వాత నమీబియా తరపున ఆడుతున్నాడు. డేవిస్ ఏడ్చిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది.