టీ20 ప్రపంచకప్ 2022 తుదిఘట్టానికి చేరుకుంది. ఇవాళ పాకిస్తాన్ , ఇంగ్లాండ్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ వేదికగా జరగనుంది. అయితే టీ20 అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్. వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఉంది. అక్యూవెదర్ ప్రకారం ఆదివారం మెల్ బోర్న్ లో 84శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. రోజంతా అడపాదడపా వర్షం కురిసిస్తే మ్యాచ్ జరగడం కష్టమే.
ఇవాళ మెల్ బోర్న్ లో గరిష్ట ఉష్ణోగ్రత 26డిగ్రీల సెల్సియస్ గా ఉంది. కనిష్ట ఉష్టోగ్రత 15డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆకాశం మేఘావ్రుతంగా ఉండటంతో చిరుజల్లులు కురిసే అవకాశం కనిపిస్తోంది. గంటలకు 37కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఈ మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.
కాగా ఫామ్ లో ఉన్న ఇంగ్లండ్ తో ఒకవేళ ఇవాళ మ్యాచ్ జరిగినట్లయితే…పాక్ కెప్టెన్ బాబర్ అజాబ్ చరిత్ర క్రియేట్ చేసే అవకాశం ఉంది. 1992లో ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్సీలో పాకిస్తాన్ వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్ ను ఓడించి ట్రోఫిని ఎగురేసుకుపోయింది. ఇప్పుడు బాబర్ అలాంటి ఫిట్ పైన్నే కన్నేశాడు. అయితో జోస్ బట్లర్ సారథ్యంలోని ఇంగ్లండ్ టీమ్ అత్యంత ప్రమాదకరమైన ఫాంలో రన్ అవుతుండటంతో పాకిస్తాన్ కు అంతఈజీ కాదు.