Virat And Rohit: రోహిత్, కోహ్లీలను అందుకే టీ ట్వంటీలకు తప్పించాం: ద్రావిడ్

సీనియర్ ఆటగాళ్లకు భారత్ టీ ట్వంటీ జట్టులో ఇక చోటు కష్టమే అన్న వార్తలు గత కొంత కాలంగా వినిపిస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే కోహ్లీ , రోహిత్ శర్మ (Virat And Rohit)ను సెలక్టర్లు పక్కన పెట్టారు. కొత్త ఏడాదిలో వరుసగా రెండు సీరీస్ లకు వీరిని ఎంపిక చేయలేదు. దీంతో వీరి అంతర్జాతీయ టీ ట్వంటీ కెరీర్ ముగిసిందని చాలా మంది తేల్చేశారు.

  • Written By:
  • Publish Date - January 24, 2023 / 01:45 PM IST

సీనియర్ ఆటగాళ్లకు భారత్ టీ ట్వంటీ జట్టులో ఇక చోటు కష్టమే అన్న వార్తలు గత కొంత కాలంగా వినిపిస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే కోహ్లీ , రోహిత్ శర్మ (Virat And Rohit)ను సెలక్టర్లు పక్కన పెట్టారు. కొత్త ఏడాదిలో వరుసగా రెండు సీరీస్ లకు వీరిని ఎంపిక చేయలేదు. దీంతో వీరి అంతర్జాతీయ టీ ట్వంటీ కెరీర్ ముగిసిందని చాలా మంది తేల్చేశారు. తాజాగా దీనిపై టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందించాడు. కోహ్లీ , రోహిత్ లను ఎందుకు ఎంపిక చేయడంలేదో వెల్లడించాడు. కివీస్‌తో సిరీస్‌కు కోహ్లీ-రోహిత్‌ను దూరం పెట్టడం కేవలం వారికి విశ్రాంతిని ఇవ్వడమేనని స్పష్టం చేశాడు.

Also Read: PCB chief selector: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కొత్త చీఫ్ సెలక్టర్‌గా హరూన్ రషీద్

కొన్ని ప్రాధాన్యాలను దృష్టిలో ఉంచుకుని వారికి విశ్రాంతినిచ్చామన్నారు. కీలక టెస్టు టోర్నీలు ఉన్నాయనీ గుర్తు చేశాడు. అలాగే ఈ యేడాది వన్డే ప్రపంచ కప్ కూడా ఉందని, అందుకే టీ ట్వంటీల వరకూ రెస్ట్ ఇస్తున్నామని ద్రావిడ్ చెప్పుకొచ్చాడు . ఇదిలా ఉంటే స్ప్లిట్ కెప్టెన్సీపై ప్రశ్నించగా.. రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర సమాధానాన్ని ఇచ్చాడు. ఈ ప్రశ్నను అడగాల్సింది తనను కాదని, సెలక్టర్లను అడగాలని సూచించారు. తనకు తెలిసినంత వరకు ప్రస్తుతానికి అలాంటిదేది ఉండదని బదులిచ్చారు. కివీస్ తో సీరీస్ తర్వాత ఫిబ్రవరి 9 నుంచి ఆస్ట్రేలియాతో భారత్ నాలుగు టెస్టుల సిరీస్‌తో పాటు మూడు వన్డేలు కూడా ఆడనుంది.