Site icon HashtagU Telugu

T Dilip: ఇంగ్లాండ్ పర్యటనకు ముందు బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం!

T Dilip

T Dilip

T Dilip: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటూ టి దిలీప్‌ (T Dilip)ను మరోసారి టీమ్ ఇండియా ఫీల్డింగ్ కోచ్‌గా నియమించింది. అతని మునుపటి ఒప్పందం మార్చి 2025లో ముగిసింది. బోర్డు అతని ఒప్పందాన్ని మరింత ముందుకు తీసుకెళ్లకూడదని వార్తలు వచ్చాయి. అయితే దాదాపు రెండు నెలల పాటు విదేశీ ఎంపికల కోసం వెతికిన తర్వాత BCCI చివరకు దిలీప్‌ను మరో ఏడాది ఒప్పందంతో తిరిగి రప్పించింది.

BCCI వర్గాలు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’తో మాట్లాడుతూ.. ‘దిలీప్‌ను ఒక సంవత్సరం పాటు మరోసారి ఫీల్డింగ్ కోచ్‌గా నియమించాలని మేము నిర్ణయించాము. అతను ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టుతో పాటు ప్రయాణిస్తారు. ఇంతకు ముందు కూడా అతని ఒప్పందం ఒక సంవత్సరందే’ అని తెలిపాయి.

దిలీప్ తిరిగి రావడం ఎందుకు ముఖ్యం?

టి దిలీప్ 2021 చివరలో రాహుల్ ద్రవిడ్ కోచింగ్ బృందంతో కలిసి భారత ఫీల్డింగ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించారు. అతని పదవీకాలంలో భారత జట్టు ఫీల్డింగ్‌లో గణనీయమైన మెరుగుదల కనిపించింది. 2023 వన్డే వరల్డ్ కప్, 2024 టీ-20 వరల్డ్ కప్ సమయంలో అతను మ్యాచ్ తర్వాత ఉత్తమ ఫీల్డర్‌కు అవార్డు ఇచ్చే సంప్రదాయాన్ని ప్రారంభించారు. దీనివల్ల ఆటగాళ్లలో ఉత్సాహం, పోటీతత్వం కనిపించింది.

Also Read: CM Revanth Reddy : ఎస్సీ, ఎస్టీలను పాలకులుగా మార్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వమే : సీఎం రేవంత్ రెడ్డి

అశ్విన్ కూడా దిలీప్‌ను ప్రశంసించారు

అతని పనిని భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ప్రశంసించారు. దిలీప్ కోచింగ్ వల్ల భారత జట్టు స్లిప్ క్యాచింగ్‌లో అద్భుతమైన మెరుగుదల వచ్చిందని చెప్పారు. భారత జట్టు జూన్ రెండవ వారంలో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఇంగ్లాండ్ పిచ్‌లపై వేగవంతమైన బౌలింగ్, స్వింగ్ కారణంగా స్లిప్ ఫీల్డింగ్, క్యాచింగ్ ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో BCCI దిలీప్‌పై నమ్మకం వ్యక్తం చేయడం టీమ్ ఇండియాకు లాభదాయకమైన నిర్ణయం కావచ్చు.