Video of Swimket: నీటిలో క్రికెట్ మ్యాచ్.. అంతర్జాతీయ క్రికెట్ని తలదన్నే ఐడియా

క్రికెట్ని మతంగా , ఆటగాళ్లను దేవుళ్లుగా చూసే దేశం మనది. ప్రతిఒక్కరి జీవితంలో క్రికెట్ ఎంతోకొంత ప్రభావం చూపే ఉంటుంది. ఇప్పుడంటే తీరిక లేక ఆడటం లేదు కానీ గ్రామాల్లో ఇంకా ఈ జెంటిల్మెన్ గేమ్ ని వదలట్లేదు. కొందరు చూడటానికి ఇష్టపడతారు. మరికొందరు బరిలోకి దిగి ఆడాలనుకుంటారు

Video of Swimket: క్రికెట్ని మతంగా , ఆటగాళ్లను దేవుళ్లుగా చూసే దేశం మనది. ప్రతిఒక్కరి జీవితంలో క్రికెట్ ఎంతోకొంత ప్రభావం చూపే ఉంటుంది. ఇప్పుడంటే తీరిక లేక ఆడటం లేదు కానీ గ్రామాల్లో ఇంకా ఈ జెంటిల్మెన్ గేమ్ ని వదలట్లేదు. కొందరు చూడటానికి ఇష్టపడతారు. మరికొందరు బరిలోకి దిగి ఆడాలనుకుంటారు. ఏదేమైనా క్రికెట్ని మించిన ఎంటర్టైన్మెంట్ ఇంకోటి ఉండదు.

క్రికెట్ని గల్లీలో చూసుంటాం, లేదా మైదానంలో చూసుంటాం. కానీ నీటి మీద క్రికెట్ ఎప్పుడూ చుసుండం. కానీ అందరిలా ఆడితే కిక్కేముంది అనుకున్నారేమో గానీ ఈ కుర్రాళ్ళు మాత్రం సినిమా తరహాలో క్రికెట్ ఆడి చూపించారు.ఈ వీడియోలో ఓ వైపున బ్యాట‌ర్ ఉండ‌గా మ‌రో వైపు బౌల‌ర్ ఉన్నాడు. మ‌ధ్య‌లో కాలువ ఉంది. దాదాపు మోకాళ్ల వ‌ర‌కు నీళ్లు ఉన్నాయి. నీటినే పిచ్‌గా ఉప‌యోగించారీ కుర్రాళ్ళు. బౌలర్ వేసిన ఓ బంతిని బ్యాటర్ నీటిని చిమ్ముతూ కవర్స్ దిశగా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అది కాస్త మిస్ అయ్యి వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్తుంది. అప్పుడు ఫీల్డింగ్ జట్టు అంపైరు అప్పీల్ చేయగా, అతను నాటౌట్ అంటాడు. ఫీల్డ్ అంపైర్ నిర్ణయంతో సంతృప్తి చెందని బౌలింగ్ టీమ్.. రివ్యూ తీసుకుంటుంది. థర్డ్ అంపైర్ రీప్లేను అల్ట్రా ఎడ్జ్ టెక్నాలజీతో పరిశీలించి ఔట్గా ప్రకటిస్తాడు. దీంతో ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటాడు.

అంతర్జాతీయ మ్యాచ్లో ఎలా సాగుతుందో అచ్చం అలాగే సాగింది. అయితే ఈ వాటర్ క్రికెట్ ఎక్కడ, ఎవరు ఆడారో వివరాలేవీ తెలియదు. కానీ కాన్సెప్ట్‌ కొత్తగా ఉండటంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వాటర్ స్విమ్ క్రికెట్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

Also Read: Vishal Clarity on Political Entry : రాజకీయ ఎంట్రీ ఫై హీరో విశాల్ ఫుల్ క్లారిటీ..